కరోనా ఎఫెక్ట్.. కన్నతల్లిని ఊర్లోకి రానివ్వకుండా..
కాగా.. గ్రామాల్లో సైతం ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గ్రామస్థులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. పక్కగ్రామాల నుంచి వచ్చే వారిని కూడా అనుమతించడం లేదు. ఓ గ్రామ సర్పంచి ఏకంగా తన కన్న తల్లిని కూడా గ్రామంలోకి అడుగుపెట్టనివ్వలేదు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గోసాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
గోసాయి పల్లి గ్రామంలో లాక్‌డౌన్ పకడ్బందిగా అమలు చేస్తున్నారు. గోసాయిపల్లి సర్పంచ్ సాయగౌడ్ తన తల్లి తులశమ్మ సోమవారం గ్రామానికి వచ్చింది. ఊర్లోకి రానివ్వకుండా పొలిమేరల్లో అడ్డుకుని వెనుకకు పంపించారు. ఇటీవలే తులశమ్మ సిర్గాపూర్‌లోని బంధువుల వద్దకు వెళ్లింది.
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడంతో గ్రామంలో ఎవరూ రాకుండా.. బయటకు వెళ్లకుండా ఉండేందుకు రోడ్డును మూసివేశారు. సొంత గ్రామానికి తులశమ్మ రావడంతో అందరికీ ఒకే విధంగా నిబంధనలు వర్తిసాయని సర్పంచ్ స్పష్టం చేశారు. ఊరుబయట నుంచే అమెను తిరిగి సిర్గాపూర్‌లోని బంధువుల వద్దకు పంపించారు.