రూ.20కే చీర.. కిలోమీటర్ల మేర క్యూకడుతున్న మహిళలు

First Published 25, Jul 2018, 2:35 PM IST
saree for Rs.20 only
Highlights

మంచిర్యాలలో ఓ షోరూం నిర్వాహకులు రూ.20కే చీర అని ప్రకటించడంతో మహిళలు కిలోమీటర్ల మేర క్యూకట్టారు

అసలే ఆషాఢ మాసం.. కొద్దిరోజుల్లో శ్రావణ మాసం రంగ ప్రవేశం చేస్తుంది. పూజలు, నోములు, వ్రతాలు, పెళ్లిళ్లు, పేరంటాలు అబ్బో హడావిడి మామూలుగా ఉండదు. మరి ఆడవాళ్లు ఊరుకుంటారా...? కొత్త చీరలు కావాలని ఇంట్లో గొడవ చేస్తుంటారు. చీర అంటే మామూలు విషయం కాదు కదా...? వందలు వేలతో ముడిపడిన అంశం. అందుకే మగవారు జేబులు తడుముకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.20 కే చీర దొరికితే..

మంచిర్యాలకు చెందిన ఓ వస్త్ర దుకాణం రూ. 20 కే చీరను అందిస్తామని ప్రకటించడంతో జనం ఆ దుకాణం ముందు భారీగా క్యూకట్టారు. కొద్ది రోజుల ముందు నుంచి దీని గురించి ప్రచారం చేయడంతో.. విషయం ఆ నోటా.. ఈ నోటా వ్యాపించింది.

ఇవాళ ఉదయం మహిళలు భారీగా అక్కడి చేరుకున్నారు.. ఎంతలా అంటే కిలోమీటర్ల మేర క్యూలైన్ ఏర్పడింది. ముందు వచ్చిన మహిళలకు టోకెన్లు ఇప్పించి వస్త్ర దుకాణం యజమాని వారికి రూ.20కే చీరను ఇచ్చి పంపారు. ప్రజా సేవలో భాగంగానే తాను అతి తక్కువ ధరకే చీరను విక్రయిస్తున్నట్లు దుకాణం యజమాని తెలిపారు. 
 

loader