సంక్రాంతికి స్వగ్రామాలకు జనం: పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ

 చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద  వాహనాల రద్దీ పెరిగింది.  సంక్రాంతికి  ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్తుండడంతో  టోల్ ప్లాజా  వద్ద  రద్దీ పెరిగింది. 

Sankranti :Huge traffic jam at Panthangi toll plaza

చౌటుప్పల్: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని  హైద్రాబాద్ నుండి  ప్రజలు తమ స్వగ్రామాలకు వెల్తుండడంతో  పంతంగి టోల్ ప్లాజా వద్ద  వాహనాల రద్దీ పెరిగింది.  ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర ప్రజలు  పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ప్రతి ఏటా సంక్రాంతికి తెలంగాణలోని హైద్రాబాద్ నగరంలో  ఉంటున్న  ఏపీ వాసులు  తమ స్వగ్రామాలకు  వెళ్తుంటారు . సంక్రాంతికి  నాలుగైదు  నెలల ముందే  రైళ్లు, బస్సుల్లో  తమ సీట్లను రిజర్వ్  చేసుకుంటారు.  సీట్ల రిజర్వేషన్ దొరకని  ప్రయాణీకులు  ప్రైవేట్  వాహనాల్లో   తమ స్వగ్రామాలకు వెళ్తుంటారు. 

సంక్రాంతి  సందర్భంగా  ఏపీలో  పెద్ద ఎత్తున కోడి పందెలా నిర్వహిస్తారు. కోడి పందెం నిర్వహిస్తే  చర్యలు తీసుకొంటామని పోలీసులు ఇదివరకే  ప్రకటించారు.  హైద్రాబాద్ నుండి  విజయవాడ వైపునకు  పెద్ద ఎత్తున వాహనాలు వెళ్తుండడంతో  యాదాద్రి భువనగిరి జిల్లా  పంతంగి టోల్ ప్లాజా వద్ద  రద్దీ పెరిగింది. టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీని క్రమబద్దీకరించేందుకు టోల్ ప్లాజా  సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రేపు టోల్ ప్లాజా వద్ద  మరింత రద్దీ ఉండే అవకాశం లేకపోలేదు. టోల్ ప్లాజా వద్ద  వాహనాలతో  ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడకుండా  పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  టోల్ ప్లాజా వద్ద వాహనాలు  గంటల తరబడి నిలబడకుండా  టోల్ ప్లాజా ిసబ్బంది తో కలిసి పోలీసులు  జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ;పంతంగి  టోల్ ప్లాజా వద్ద  16 గేట్లు  ఉన్నాయి. 10 గేట్లను  హైద్రాబాద్ నుండి విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలను పంపేందుకు  వినియోగిస్తున్నారు. విజయవాడ వైపు నుండి హైద్రాబాద్ కు వెళ్లే వాహనాల కోసం ఆరు గేట్లను వినియోగిస్తున్నారు. జాతీయ రహదారిపై  65పై  పంతంగి, కొర్లపహడ్ ,చిల్లకల్లు వద్ద  ఉన్న టోల్ ప్లాజాల వద్ద  వాహనాల రద్దీ ఏర్పడకుండా  జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios