Asianet News TeluguAsianet News Telugu

Congress: నోరు జారితే వెనక్కి తీసుకుంటా.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

పార్టీకి సంబంధించిన పలు అంశాలను పీఏసీలో లేవనెత్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే (sangaredy mla), కాంగ్రెస్ (congress) సీనియర్ నేత జగ్గారెడ్డి (jagga reddy) అన్నారు. కొందరు లోపల ఒకలా.. బయట మరోలా మాట్లాడాతారని అనుకున్నారంటూ ఆయన మండిపడ్డారు. 

sangareddy congress mla jagga reddy sensational comments
Author
Hyderabad, First Published Nov 3, 2021, 7:09 PM IST

పార్టీకి సంబంధించిన పలు అంశాలను పీఏసీలో లేవనెత్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే (sangaredy mla), కాంగ్రెస్ (congress) సీనియర్ నేత జగ్గారెడ్డి (jagga reddy) అన్నారు. కొందరు లోపల ఒకలా.. బయట మరోలా మాట్లాడాతారని అనుకున్నారంటూ ఆయన మండిపడ్డారు. సీఎల్పీ నేత, పీసీసీ, ఠాగూర్‌లను గౌరవిస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వాళ్లు సోనియా గాంధీ దూతలని చెప్పారు. ఠాగూర్ విషయంలో నోరు జారినా వెనక్కి తీసుకుంటామని జగ్గారెడ్డి చెప్పారు. 2023 వరకు పార్టీ వ్యవహారాలపై మీడియాతో మాట్లాడనని చెప్పానని ఆయన గుర్తుచేశారు. 

అంతకుముందు బుధవారం నాడు ఆయన గాంధీభవన్ లో  మీడియాతో మాట్లాడారు.ఉన్నది ఉన్నట్టు చెప్తే అందరికీ శతృవు అవుతున్నానని అభిప్రాయపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో (huzurabad byPoll) క్షేత్రస్థాయి పరిస్థితి గురించి బోస్ రాజు, Manickam Tagore కు ఏం తెలుసునని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పార్టీ సమావేశంలోనూ, మీడియాలోనూ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఇబ్బంది కలుగుతుందన్నారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో కొన్ని విషయాలపై తాను మాట్లాడుతానని జగ్గారెడ్డి చెప్పారు. అయితే తాను ఏం మాట్లాడుతానో మాత్రం ఇప్పుడే చెప్పబోనన్నారు. పార్టీ అంతర్గత విషయాలకు సంబంధించి తాను  ఇవాళే పార్టీ నేతలతో చర్చిస్తానన్నారు.  భవిష్యత్తులో ఈ విషయాలపై తాను చర్చించబోనని హామీ ఇచ్చారు.  

ALso Read:Huzurabad bypoll Result 2021: కాంగ్రెస్ ఓటమిపై నివేదిక ఇవ్వాలని ఠాగూర్ ఆదేశం

మీడియాలో ఓ సెక్షన్ తనకు వ్యతిరేకంగా ఉన్నారనే అభిప్రాయాన్ని జగ్గారెడ్డి వ్యక్తం చేశారు. ఒక్కఉప ఎన్నికతోనే  ఏమౌతోందని ఓ సెక్షన్ మీడియా తనను ప్రశ్నిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో నా సీటు ఎలా గెలిపించుకోవాలనే దానిపైనే శ్రద్ద పెడుతానన్నారు. రానున్న రోజుల్లో తాను సంగారెడ్డిలో గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు. పార్టీ వ్యవహరాలపై మాట్లాడినందుకు తనకు షోకాజ్ నోటీసు ఇస్తారో లేదో వాళ్లిష్టమని, ఈ విషయం తనకు తెలియదని జగ్గారెడ్డి చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు వెళ్తేనే ఓట్లు పడలేదు. జగ్గారెడ్డిని చూసి ఓట్లు వేస్తారా అని ఆయన సెటైర్లు వేశారు.

కాగా.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బల్మూరి వెంకట్ ను రేవంత్ రెడ్డి (revanth reddy) , మల్లు భట్టి విక్రమార్కలు (mallu bhatti vikramarka) బలి పశువును చేశారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ వస్తే రేవంత్ రెడ్డి ప్రతిభ, కాంగ్రెస్ కు డిపాజిట్ రాకపోతే  సీనియర్ల తప్పిదమని రేవంత్ అనుచరులు ప్రచారానికి సిద్దమయ్యారని జగ్గారెడ్డి మంగళవారం నాడు వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై జగ్గారెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కొందరు నేతలుఅభిప్రాయపడ్డారు. అయితే ఈ వ్యవహరం ఎఐసీసీ పరిధిలో ఉంటుంది.  దీంతో కొంత వెనక్కు తగ్గారనే ప్రచారం కూడా సాగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios