Asianet News TeluguAsianet News Telugu

సమతపై గ్యాంగ్ రేప్: నిందితుల తరపున వాదించేందుకు ముందుకురాని లాయర్లు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సమత కేసులో  నిందితులను పోలీసులు  సోమవారం నాడు కోర్టులో హాజరుపర్చారు. 

Samatha Gang Rape Case:Lawyers who do not advocate on behalf of the accused
Author
Hyderabad, First Published Dec 16, 2019, 5:17 PM IST

హైదరాబాద్: సమతపై గ్యాంగ్ రేప్ కేసులో  నిందితులను పోలీసులు సోమవారం నాడు కోర్టులో హాజరుపర్చారు. జ్యూడీషీయల్ కస్టడీకి నిందితులను రేపు హాజరుపర్చే అవకాశం ఉంది.

గత నెల 24వ తేదీన గోసంపల్లిలో సమతపై ముగ్గురు నిందితులపై పోలీసులు  గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి, హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సోమవారం నాడు నిందితులను కోర్టులో హాజరుపర్చారు.

Also read:సమత గ్యాంగ్ రేప్, హత్య: 44 మంది సాక్షుల విచారణ, ఛార్జీషీట్ ఇదీ...

నిందితుల తరపున వాదించేందుకు లాయర్లు ఎవరూ కూడ ముందుకు రాలేదు.   ఈ కేసుకు సంబంధించిన ఛార్జీషీట్ ను ఈ నెల 14వ తేదీన ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో పోలీసులు దాఖలు చేశారు. కేసు విచారణను  కోర్టు రేపటికి వాయిదా వేశారు.నిందితులను జ్యూడీషీయల్ రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.

నిందితులు బాధితురాలిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి, ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ ఘటన బయటకు రావడంతో ఆమెను హత్య చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.  ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో హాజరుపర్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios