కత్తుల దాడిలో గాయపడ్డ సాయివరప్రసాద్ మృతి.. ఆస్పత్రి నిర్లక్ష్యంపై సుమోటో... (వీడియో)
హైదరాబాద్ మీర్ పేట్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని కత్తులు, బీర్ బాటిళ్లతో దాడి చేసి హత్య చేశారు. అతనికి ప్రథమచికిత్స ఇవ్వడానికి నిరాకరించిన ఆస్పత్రిపై పోలీసులు సుమోటో కేసు నమోదు చేయనున్నారు.

హైదరాబాద్ : హైదరాబాద్ లోని మీర్ పేట్ లో సోమవారం జరిగిన కత్తుల దాడిలో గాయపడిన సాయివరప్రసాద్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కత్తులతో, బీరు బాటిళ్లతో మద్యం మత్హులో చెలరెగిపోతూ.. ఎదురొచ్చిన వారిని చంపుకుంటూ దాడులు చేస్తూ.. వీరంగం సృష్టించారు కొంతమంది. ఇంత జరుగుతున్నా ఇదేంటని అడిగే నాధుడే లేకపోవడం గమనార్హం. దీంతో భయబ్రాంతులకు గురైన స్థానికులు అసలు మీర్ పేట్ లో పోలీసులున్నారా అంటూ మండిపడుతున్నారు.
నిన్న ఒక్కరోజే మీర్ పెట్ పరిధిలో ముగ్గురిపై కత్తులతో బీరు బాటిళ్లతో దాడులు జరిగాయి. సోమవారం మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగా సాయి వరప్రసాద్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. జిల్లాలగూడా స్వాగత్ హోటల్ వద్ద ముగ్గురు యువకులు కలిసి సాయి అనే వ్యక్తిని కత్తులతో దాడి చేశారు.
గంజాయి మత్తులో ఆకతాయి గ్యాంగ్ వీరంగం... ఇద్దరు యువకులపై కత్తులతో దాడి
ఇది తెలిసిన అతని స్నేహితులు, బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంతజరుగుతున్న మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వివరాలు గోప్యంగా ఉంచడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా గాయపడిన సాయి వరప్రసాద్ ను మొదట సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లగా, డాక్టర్లు లేరని, అంబులెన్స్ లేదని చికిత్సకు నిరాకరించారు.
బాధితుడికి ప్రథమ చికిత్స అందించకపోవడం, అత్యవసర సమయంలో నిర్లక్ష్యం వహించడం వంటి కారణాలతో మీర్‌పేట పోలీసులు ఆసుపత్రి అధికారులపై సుమోటో కేసు నమోదు చేయబోతున్నారు.