సైనా పొలిటికల్ ఎంట్రీ: బీజేపీలోకి నెహ్వాల్

బీజేపీలో చేరాలని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సైనా నెహ్వాల్ నిర్ణయం తీసుకొన్నారు. బుధవారం నాడు ఆమె బీజేపీలో చేరారు.

Saina Nehwal to join BJP today

న్యూఢిల్లీ: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు..ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైనా నెహ్వాల్ బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసే అవకాశం ఉందని సమాచారం.

Also read:మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి షాక్: ఆధిపత్య పోరుతోనే అనర్థమా..?

గత ఏడాది ఏప్రిల్ మాసంలో హైద్రాబాద్ వచ్చిన సమయంలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైనా నెహ్వాల్ ఇంటికి వెళ్లారు. బీజేపీ చేస్తున్న కార్యక్రమాలను ఆయన వివరించారు

బుధవారం నాడు ఉదయం సైనా నెహ్వాల్ న్యూఢిల్లీలోని బీజేపీ నేతలను కలిశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. కొంత కాలంగా సైనా నెహ్వాల్ బీజేపీ చేస్తున్న  కార్యక్రమాలకు అనుకూలంగా షోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.  హర్యానా రాష్ట్రంలో పుట్టిన  సైనా నెహ్వాల్ పుట్టింది. ఒలంపిక్స్, కామన్‌వెల్త్ గేమ్స్ లలో సైనా నెహ్వాల్ పలు పతకాలను పొందింది.

29 ఏళ్ల సైనా నెహ్వాల్ 2015లో ప్రపంచ ర్యాంకింగ్‌లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకొన్నారు.  కొంత కాలంగా ఆమె అనేక పోటీల్లో  ఆమె సరిగా రాణించడం లేదు.  
ఈ తరుణంలో ఆమె బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొంది. 

ఢిల్లీ ఎన్నకల్లో సైనా నెహ్వాల్ తో బీజేపీ ప్రచారం నిర్వహించాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడ బీజేపీ బలపడాలని భావిస్తోంది. గ్లామర్ ఉన్న వారిని తమ పార్టీలో చేర్చుకోవాలని ఆ పార్టీ నాయకత్వం తలపెట్టింది.

సినీ నటుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపారు. ఏపీతో పాటు తెలంగాణలో కూడ జనసేన పార్టీతో కలిసి పనిచేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో  ఇప్పటికే ఇతర పార్టీల నుండి వచ్చే నేతలకు బీజేపీ నాయకత్వం గాలం వేస్తోంది. 

మున్సిపల్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఎక్కువ వార్డులను బీజేపీ నాయకత్వం గెలుచుకొంది. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ నాయకత్వం కేంద్రీకరించి పనిచేస్తోంది. సైనా నెహ్వాల్ లాంటి గ్లామర్ ఉన్న వారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీ క్యాడర్ లో కొంత జోష్ ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. సైనా నెహ్వాల్ సేవలను తెలంగాణలో కూడ ఎక్కువగా ఆ పార్టీ ఉపయోగించుకొనే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బ్యాడ్మింటన్ లో కాంస్య పతకాన్ని సాధించిన భారత మహిళగా సైనా నెహ్వాల్ రికార్డు సృష్టించింది.  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్  సైనా నెహ్వాల్  బ్యాడ్మింటన్ లో నెహ్వల్ సాధించిన ప్రగతిని  వివరించారు.

దేశం కోసం మోడీ చేస్తున్న కృషిని చూసి తాను బీజేపీలో చేరినట్టుగా సైనా నెహ్వాల్ బుధవారం నాడు న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆమె ప్రకటించారు.  సైనా నెహ్వాల్‌తో పాటు ఆమె సోదరి చంద్రాన్షు నెహ్వాల్‌ కూడ బీజేపీలో చేరారు.



 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios