కట్టుకున్న భార్య పట్ల నీచాతి నీచంగా వ్యవహరించాడు ఈ శాడిస్టు మొగుడు. తుదకు కటకటాలపాలయ్యాడు. ఆ వివరాలు ఒకసారి చదవండి.

కట్టుకున్న భార్య నగ్న ఫోటోలను, వీడియాలు తీశాడు. ఆ వీడియోలు, ఫొటోలను భార్య సోదరుడికి మెయిల్ ద్వారా పంపించాడు. అది కూడా ఫేక్ ఎకౌంట్ తీసి మెయిల్ చేశారు.

తన మీద, తన కుటుంబసభ్యుల మీద భార్య పెట్టిన కేసులను విత్ డ్రా చేసుకోవాలన్న డిమాండ్ తో ఇంతటి నీచానికి ఒడిగట్టాడు ఆ మొగుడు. ఈ సంఘటన హైడరాబాద్ లో జరిగింది.

కట్టుకున్న భార్య నగ్న ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న సునీల్ అనే వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.  తనతో పాటు తన కుటుఃబం పెట్టిన కేసులను విత్ డ్రా చేసుకోవాలంటూ బాధితురాలి సోదరుడికి ఫేక్ మెయిల్ ఐడీతో వీడియో, ఫోటోలను పంపించాడు సునీల్.

సునీల్ నిర్వాకంపై సైబర్ క్రైం సిబ్బందిని ఆశ్రయించారు బాధితురాలు, ఆమె సోదరుడు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఐపి అడ్రస్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు సైబర్ క్రైం సిబ్బంది.

ఇలాంటి మొగుడు కూడా ఉంటారా అని ఇది విన్న జనాలు ఆశ్చర్యపోతున్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి