Asianet News TeluguAsianet News Telugu

నేడు సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ అస్తిత్వానికి నిలుటద్దం బతుకమ్మ. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన వేడుకలు.. నేడు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధుస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. 

Saddula Bathukamma celebrations Traffic restrictions in hyderabad today
Author
First Published Oct 3, 2022, 9:25 AM IST

తెలంగాణ అస్తిత్వానికి నిలుటద్దం బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన వేడుకలు.. నేడు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. సద్దుల బతుకమ్మ సందర్భంగా ఎల్‌బీ స్టేడియం, ట్యాంక్‌ బండ్‌ వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించింది. 

ఇదిలా ఉంటే.. సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధుస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.  సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలోని ఎల్బీ స్టేడియం, లిబర్టీ జంక్షన్, అప్పర్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

-చాపెల్ రోడ్డు నుండి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్.. ఏఆర్ పెట్రోల్ పంపు వద్ద పీసీఆర్ వైపు మళ్లించబడుతుంది. ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ నుంచి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
-రవీంద్ర భారతి, హిల్ ఫోర్ట్ రోడ్డు నుంచి వచ్చే వాహనదారులను సుజాత హైస్కూల్ వైపు మళ్లిస్తారు.
-బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ నుంచి వాహనాలు బీజేఆర్ విగ్రహం వద్ద కుడి మలుపు తీసుకోవడానికి అనుమతించబడవు. ఆ వాహనాలు ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వరకు వెళ్లాలి.
-ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను హిమాయత్ నగర్ వై జంక్షన్ వైపు మళ్లిస్తారు.
-కింగ్ కోఠి, బొగ్గులకుంట నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా బషీర్‌బాగ్ వెళ్లే వాహనాలను కింగ్ కోఠి ఎక్స్ రోడ్స్ వద్ద తాజ్‌మహల్ వైపు మళ్లిస్తారు.
-హిమాయత్ నగర్ వై జంక్షన్ నుండి లిబర్టీ మీదుగా అప్పర్ ట్యాంక్ బంక్ వైపు వచ్చే ట్రాఫిక్ బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్ వైపు మళ్లించబడుతుంది.
-సికింద్రాబాద్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్-జబ్బార్ కాంప్లెక్స్- కవాడిగూడ-లోయర్ ట్యాంక్ బండ్-కట్ట మైసమ్మ- తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లించబడుతుంది.
-ఇక్బాల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ ఓల్డ్ గేట్ సెక్రటేరియట్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్-కట్టమైసమ్మ-ఇందిరా పార్క్-గాంధీ నగర్-ఆర్టీసి ఎక్స్ రోడ్ మీదుగా మళ్లించబడుతుంది.
-పంజాగుట్ట, రాజ్ బవన్ రోడ్డు నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ప్రసాద్స్ ఐమాక్స్, మింట్ లేన్ వైపు మళ్లించబడుతుంది.
-నల్లగుట్ట జంక్షన్ నుంచి బుధ భవన్ వైపు వెళ్లే వాహనాలను నల్లగుట్ట ఎక్స్ రోడ్స్ వద్ద రాణిగంజ్, నెక్లెస్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
-హిమాయత్ నగర్, బషీర్‌బాగ్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుతల్లి జంక్షన్-ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లించబడుతుంది.
-ముషీర్‌బాద్, కవాడిగూడ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కవాడిగూడ ఎక్స్ రోడ్ వద్ద లోయర్ ట్యాంక్ బండ్-కట్టమైసమ్మ వైపు మళ్లిస్తారు.

పార్కింగ్ ప్రదేశాలు.. 
వీఐపీలు, పోలీసు సిబ్బందికి టెన్నిస్ గ్రౌండ్, ఎల్‌బీ స్టేడియంలో పార్కింగ్ స్థలాలు కేటాయించబడ్డాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వాహనాలు బీజేఆర్ సర్కిల్‌కు దగ్గరగా ఉన్న ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలో పార్కింగ్‌ చేసుకునేందుకు కేటాయించారు. అతిథులను తరలించే అన్ని బస్సులు బుద్ధ భవన్ వెనుక ఉన్న నెక్లెస్ రోడ్‌కు వెళ్తాయి. నిజాం కాలేజీ గ్రౌండ్‌లో రిజర్వ్‌డ్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios