హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో గల అల్మాస్ గుడా కురుమల గూడ వరదల్లో చిక్కుకున్న కాలనీలో ఆమె పర్యటించారు. 

తమకు సమాచారం ఇవ్వకుండా సబితా ఇంద్రారెడ్డి పర్యటన చేయడంపై కార్పోరేటర్లు నిలదీశారు. గత రెండు రోజులుగా స్థానిక కౌన్సిలర్లు, కార్పోరేటర్లు బస్తీలో తిరుగుతా ప్రజల అవసరాలను ఉన్నారు. 

Also Read: వరదలో కొట్టుకుపోయిన ఐదుగురు.. నలుగురి మృతి: ఒకరిని కాపాడిన చెట్టు

ప్రభుత్వం అధికారంలో ఉంటే మాత్రం కనీసం స్థానిక కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా వార్డుల్లో పర్యటించడం సరైంది కాదని స్థానిక కార్పోరేటర్లు సబితా ఇంద్రారెడ్డిని ప్రశ్నించారు. ఆ స్థితిలో సబితా ఇంద్రారెడ్డి ఏ విధమైన సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెనక్కి మళ్లారు. 

Also Read: ఈ విలయం చాలు.. మళ్లీ వానలొద్దు: చిలుకూరు బాలాజీకి ప్రత్యేక పూజలు

మూడు రోజులుగా మహేశ్వరం నియోజకవర్గంలోని కాలనీల్లో నీరు నిలిచి ఉంది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాదులో కురిసిన భారీ వర్షాలకు కాలనీలు నిండా మునిగాయి. మరణాలు కూడా సంభవించాయి.