Asianet News TeluguAsianet News Telugu

మోడీపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు.. రూపాయి డౌన్, అబద్దాలు అప్.. అంటూ ట్వీట్స్...

రూపాయి విలువ పతనం అవ్వడం మీద కేటీఆర్ వ్యంగ్యాస్రాలు విసిరారు. విశ్వగురూ వర్థిల్లాలి అంటూ మోడీ మీద సెటైరికల్ ట్వీట్స్ చేశారు. 

Rupee Falls To All-Time Low, KTR Satirical Joke On Rupee Downfall
Author
First Published Sep 24, 2022, 10:31 AM IST

హైదరాబాద్ : డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోవడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా దిగజారింది. కానీ, అబద్దాలు మాత్రం ఎన్నడూ లేనంతగా పెరిగాయి. రూపాయి విలువ ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోతున్నా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం రేషన్ షాపుల్లో ప్రధాని మోడీ ఫోటోను వెతకడంలో తీరిక లేకుండా ఉన్నారు.  రూపాయి తన సహజ మార్గంలో వెళుతోందని, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితరాలన్నీ దేవుడు లీలలు అని మీకు చెప్తారు. విశ్వ గురు వర్ధిల్లాలి అని నినదించమంటారు’ కేటిఆర్ ఎద్దేవా చేశారు. 

‘రూపాయి విలువను ప్రపంచ మార్కెట్లు,  ఫెడ్ రేట్లు ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూడండి.. అంటూ జ్ఞానాన్ని అందజేస్తున్న భక్తులు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. విశ్వగురు మోదీ మీ వాదనను అంగీకరించరు. ఆయన జ్ఞాన సంపదలోని కొన్ని ఆణిముత్యాలను మీ దృష్టికి తీసుకు వస్తున్నా.. ‘కేంద్రంలో అవినీతి పెరగడం వల్లే రూపాయి విలువ పడిపోతోంది. రూపాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంది’ అని 2013లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ నాటి యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన ట్వీట్ లను పదుల సంఖ్యలో కేటీఆర్ తన వ్యాఖ్యలకు జోడించారు.

ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ స‌ర్కార్ సీరియస్

ప్రభుత్వ పనితీరుకు  ప్రశంసలు..
స్వచ్ఛ సర్వేక్షన్ లో రాష్ట్రానికి అవార్డుల పంటపండడంపై పంచాయతీరాజ్ మంత్రి దయాకర్ రావును మంత్రి కేటీఆర్ అభినందించారు. రాష్ట్రంలోని 12,769 మంది సర్పంచులు,  ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ సెక్రెటరీలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షన్  గ్రామీణ ర్యాంకుల్లో  దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘పల్లె ప్రగతి’  ద్వారానే ఇది సాధ్యం అయింది అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసినా తమ ప్రభుత్వ పనితీరు అనేకమంది మన్ననలు పొందుతూ,  మనసు చూరగొంటోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

రైతు బీమాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,450 కోట్లు విడుదల చేయడంపై స్పందిస్తూ దేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వమే రైతులకు జీవిత బీమా చేస్తోందని, ఇప్పటివరకు రైతు బీమా ద్వారా 85 వేల మంది రైతు కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున సాయం అందించింది అన్నారు. ఈ ఏడాది  34లక్షల మంది రైతులకు వర్తించేలా రూ.1,450 కోట్లు  ప్రీమియం చెల్లించాం అన్నారు. 

సెర్బియా సదస్సుకు ఆహ్వానం..
అక్టోబర్ 20న  సెర్బియాలోని బెల్ గ్రేడ్ లో జరిగే ‘ బయోటెక్ ఫ్యూచర్ సదస్సుకు హాజరు కావాలని సెర్బియా ప్రభుత్వం మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం పంపింది. దీనిపై కేటిఆర్ స్పందిస్తూ సెర్బియా ప్రధాని అనాబ్న్రా బిక్ కు  కృతజ్ఞతలు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రత్యేకించి బయోటెక్నాలజీ రంగంలో తెలంగాణ సామర్థ్యానికి ఈ ఆహ్వానాన్ని గుర్తింపుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios