Asianet News TeluguAsianet News Telugu

ఇబ్బందికర పరిస్థితులు, నరదృష్టిని తొలగించడానికి కేసీఆర్ యాగం?

తెలంగాణాలో పరిస్థితులు అధికార పక్షాన్ని ఇబ్బందిపెట్టేలానే ఉన్నాయి. విపక్షాలు ఇదే అదునుగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కి ట్రిప్పులు కొడుతూ మరి కేసీఆర్ సర్కార్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.

Rumours Are Rife That CM KCR To Perform Yagam To Ward Off Nara Drishti?
Author
Hyderabad, First Published Jul 17, 2020, 7:34 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  అనుకూలిస్తున్నట్టుగా కనబడడం లేదు. కరోనా కేసుల నానాటికీ ఈకువవుతుండడం, కేసీఆర్ ఫార్మ్ హౌస్ కి వెళ్లడంతో అంతా కూడా వేర్ ఈజ్ కేసీఆర్ అనే ఒక ట్విట్టర్ ట్రెండ్ ని నడిపించారు. ఇక అది సద్దుమణిగింది అని అనుకుంటుండగానే సెక్రటేరియట్ కూల్చివేత, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో వరద నీరు ఏరులై పొంగడం. 

అన్ని వెరసి తెలంగాణాలో పరిస్థితులు అధికార పక్షాన్ని ఇబ్బందిపెట్టేలానే ఉన్నాయి. విపక్షాలు ఇదే అదునుగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కి ట్రిప్పులు కొడుతూ మరి కేసీఆర్ సర్కార్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. సెక్రటేరియట్ కన్నా ముందు ఉస్మానియా ఆసుపత్రిని కూల్చి కొత్తది కట్టిస్తానన్న కేసీఆర్ కరోనా కష్టకాలంలో వైద్యాన్ని, ప్రజల  గాలికొదిలేసి సెక్రటేరియట్ మీదపడడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. 

ఇక రేవంత్ రెడ్డి వంటివారైతే జి బ్లాక్ కిందున్న నిధుల కోసమే కేసీఆర్ సెక్రటేరియట్ కూల్చివేతకుపూనుకున్నాడని ఆరోపిస్తున్నారు. వాస్తు అనే కారణం చెప్పి కరోనా విజృంభిస్తున్న వేళ, ప్రజలు బెడ్లు దొరక్క ఇబ్బందులు పడుతుంటే... కనీసం దాన్ని క్వారంటైన్ సెంటర్ గా అయినా వాడకుండా ఇలా కూల్చివేతకు దిగడం ఎంతవరకు సమంజసం అని అంటున్నారు. 

ఇక కేసీఆర్ ప్రస్తుత గ్రహగతులు ఎలా ఉన్నాయో ఏమిటో తెలియదు. కొందరు పండితులు టీవీల్లో, సోషల్ మీడియాల్లో కేసీఆర్ గ్రహగతులు ప్రస్తుతం బాగోలేవని ఊదరగొడుతున్నారు. వాటివల్లే ఈ అనార్థాలని అంటున్నారు. దేవుడిని అధికంగా నమ్మే కేసీఆర్ ఒకసారి తన గ్రహగతుల ఆధారంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కూడా సద్దుమణిగేలా యాగం చేపించాలని యోచిస్తున్నట్టుగా తెలియవస్తుంది. 

గతంలో కూడా కేసీఆర్ అనేక యాగాలను చేసిన విషయం తెలిసిందే ఆయుత చండి యాగం నుండి మొదలు ఎన్నికల ముందు రాజశ్యామల యాగం వరకు కేసీఆర్ అనేక యాగాలను నిర్వహించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి ఆయన చిన్నజీయర్ స్వామిని కలవనున్నట్టు సమాచారం. కేసీఆర్ గనుక యాగం నిర్వహిస్తే అది రాష్ట్ర సౌభాగ్యం కోసమేనని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. 

తెలంగాణ ప్రజల్లో చాలా మంది కేసీఆర్ యాగాలను బలంగా విశ్వసిస్తారు. కేసీఆర్ చండీయాగం నిర్వహించినప్పుడు బస్సుల్లో అక్కడకు వచ్చి తీర్థప్రసాదాలను తీసుకొని వెళ్లారు. ఈ కరోనా కష్టకాలంలో ప్రజల విశ్వాసాన్ని, వారికి ఒక ధైర్యాన్ని గనుక ఇచ్చేదిగా ఈ యాగం ఉంటే ఎంతోకొంత మేలని సోషల్ మీడియాలో అనేవారుసైతం లేకపోలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios