Asianet News TeluguAsianet News Telugu

విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

ఒమిక్రాన్ వైరస్ కు సంబంధించి రాష్ట్రంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.కరోనా విషయంలో  ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

RTCPR test compulsury For  forign passengers from Dec 1 in Telangana: says Health Director Srinivasa Rao
Author
Hyderabad, First Published Nov 30, 2021, 3:35 PM IST


హైదరాబాద్: విదేశాల నుండి వచ్చే  ప్రయాణీకులపై ఆర్టీపీసీఆర్ పరీక్షలను ఇవాళ్టి నుండి తప్పనిసరి చేస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. Omicron కేసులు నమోదైన 12  దేశాల నుండి 40 మంది Telangana రాష్ట్రానికి వచ్చారని ఆయన చెప్పారు. వారందరికి Corona  పరీక్షలు నిర్వహిస్తే  నెగిటివ్ గా తేలిందన్నారు. అయినా కూడా  వారిని  హోం క్వారంటైన్ కు తరలించినట్టుగా డాక్టర్ Srinivasa Rao చెప్పారు.

కొత్త కేసులు నమోదైతే ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. ఒమిక్రాన్ కేసులు నమోదైన 12 దేశాల నుండి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలున్నాయన్నారు. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఆరు శాతం వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆయన చెప్పారు.కానీ వ్యాధి తీవ్రతపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. అయితే ప్రాథమికి నివేదికల ఆధారంగా వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందని తెలుస్తోందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఒమిక్రాన్ వైరస్ విషయమై అసత్య ప్రచారాలను  నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు. నిన్న జరిగిన Telangana Cabinet సమావేశంలో ఈ విషయమై చర్చించినట్టుగా ఆయన గుర్తు చేశారు.

also read:Omicron: గుడ్ న్యూస్.. మనదేశంలో కొత్త వేరియంట్ లేదు: కేంద్రం.. రాష్ట్రాల అధికారులతో సమావేశం

నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో కూడా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ విషఁయమై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సబ్ కమిటీకి మంత్రి హరీష్ రావు చైర్మెన్ గా వ్యవహరిస్తారు.ఈ కమిటీలో  మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,  సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ లు సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ; రాష్ట్రంలో కరోనా కేసులు అతి తక్కువగానే నమోదౌతున్నాయి. అయితే కరోనా మరోసారి విజృంభిస్తే ఆర్ధిక పరిస్థితులు తలకిందులయ్యే అవకాశాలుంటాయి. దీంతో  కరోనా  వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఒమిక్రాన్  వైరస్ వ్యాప్తి చెందితే  ఒళ్లు నొన్పితో పాటు, తలనొప్పి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.దేశంలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు

Follow Us:
Download App:
  • android
  • ios