Asianet News TeluguAsianet News Telugu

ఏపీ, తెలంగాణల మధ్య కుదరని సయోధ్య: కదలని ఆర్టీసీ బస్సులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య  ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ విషయమై రెండుు రాష్ట్రాల అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. 1.52 లక్షల కి.మీ. మాత్రమే బస్సులు నడుపుతామని  తెలంగాణ చెబుతోంది.

RTC talks between Andhra, Telangana inconclusive, resumption of services may be delayed
Author
Hyderabad, First Published Sep 4, 2020, 12:02 PM IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య  ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ విషయమై రెండుు రాష్ట్రాల అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. 1.52 లక్షల కి.మీ. మాత్రమే బస్సులు నడుపుతామని  తెలంగాణ చెబుతోంది.

ఈ ఏడాది మార్చి 22 వ తేదీ నుండి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. కరోనా నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను నిలిపివేశారు.

అంతరాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్దరించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే రెండు రాష్ట్రాల మధ్య బస్సుల సర్వీసులను నడిపే విషయంలో రెండు రాస్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయమై రెండు రాష్ట్రాల అధికారులు పలుమార్లు చర్చించారు. కానీ ఏకాభిప్రాయం మాత్రం కుదరలేదు.

2014-19 మధ్య కాలంలో రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ముగిసింది. దీంతో కొత్తగా అగ్రిమెంట్ చేసుకొందామని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఒప్పందం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.

తమకు నష్టాలు ఎక్కువగా వస్తున్నందున 1.52 లక్షల కి.మీ మాత్రమే బస్సులను నడుపుతామని ఏపీకి తెలంగాణ ప్రభుత్వం తెగేసీ చెప్పింది.  ఏపీ ప్రభుత్వం తాము తెలంగాణలో 2.10 లక్షల కి.మీ నడుపుతామని చెప్పింది. ఈ ప్రతిపాదనకు తెలంగాణ అంగీకరించడం లేదు. కొత్తగా ఒప్పందం చేసుకొందామని ఏపీకి తెలంగాణ ప్రతిపాదిస్తోంది.

also read:హైద్రాబాద్‌లో ప్రారంభం కానున్న మెట్రో రైళ్లు: సిటీ బస్సులపై తేల్చని సర్కార్

తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రస్తుతం 1.2 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను నడుపుతోంది. 800 బస్సులను తెలంగాణలో నడుపుతోంది.విజయవాడ,గుంటూరు, అనంతపురం, కర్నూల్ జిల్లాలకు హైద్రాబాద్ నుండి 600 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నడుపుతోంది. తొలివిడతగా 256 బస్సులను నడపాలని ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణకు ప్రతిపాదించింది. ఆ తర్వాత దశలవారీగా బస్సుల సంఖ్యను పెంచాలని ప్రతిపాదిస్తోంది. కానీ తెలంగాణ మాత్రం కొత్త ఒప్పందం చేసుకోవాలని కోరుతోంది.

దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. దీంతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో న్యాయ సలహా తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios