Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో ప్రారంభం కానున్న మెట్రో రైళ్లు: సిటీ బస్సులపై తేల్చని సర్కార్

ఈ నెల 7వ తేదీ నుండి మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కానీ హైద్రాబాద్ లో సిటీ బస్సులు నడిచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

Telangana Govt Decides Not To Resume City Buses in hyderabad
Author
Hyderabad, First Published Sep 2, 2020, 10:46 AM IST

హైదరాబాద్: ఈ నెల 7వ తేదీ నుండి మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కానీ హైద్రాబాద్ లో సిటీ బస్సులు నడిచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

ఈ ఏడాది మార్చి 22వ తేదీనుండి హైద్రాబాద్ లో సిటీ  బస్సులను నిలిపివేశారు. ఈ ఏడాది మే 19వ తేదీ  నుండి ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. కానీ సిటీ బస్సులను మాత్రం నిలిపివేశారు.

మెట్రో రైళ్లకు ఈ నెల 7వ  తేదీ నుండి నడిపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో హైద్రాబాద్ లో కూడ మెట్రో రైలు సర్వీసులను నడిపేందుకు హెచ్ఎంఆర్ ప్రయత్నాలు చేస్తోంది. కానీ సీటి బస్సులను నడిపే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల కాలంలో కరోనా కేసులు తక్కువగా నమోదౌతున్నాయి. ఈ మాసాంతానికి రాష్ట్రంలో కరోనాను అదుపులోకి తెస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో  ప్రతి రోజూ సుమారు 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. కరోనా నేపథ్యంలో సిటీ బస్సులను నడిపే విషయంలో ఆర్టీసీ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.

also read:ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు: తేలని అధికారుల చర్చలు, మరోసారి భేటీ

మెట్రో రైళ్లలో ప్రయాణీకులను నియంత్రించే అవకాశం ఉంటుంది. కానీ సిటీ బస్సుల్లో ప్రయాణీకులను నియంత్రించే అవకాశం ఉండదు. ఈ కారణంగానే సిటీ బస్సులను నడిపే విషయంలో ప్రభుత్వం  నిర్ణయం తీసుకోవడం లేదని తెలుస్తోంది. సిటీ బస్సుల ద్వారా కరోనా సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు నడుపుతున్నా కూడ ఆర్టీసీకి ఆశించిన ఆదాయం రావడం లేదు. పైగా ప్రయాణీకులు కూడ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి అంతగా సుముఖంగా లేరు. అనివార్య పరిస్థితుల్లోనే ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సిటీ బస్సులను నడిపే విషయంలో ప్రభుత్వం ఇంకా వేచి చూసే ధోరణితో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios