వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆర్టీసీ కండక్టర్ రవీందర్ గుండెపోటుతో ఆదివారం నాడు ఉదయం మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. 

ఆర్టీసీ కండక్టర్ ఏరుకొండ రవీందర్ కు నాలుగు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది.దీంతో ఆయనను కుటుంబసభ్యులు హైద్రాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హైద్రాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  రవీందర్ మృతి చెందాడు. 

రవీందర్ మృతదేహాన్ని ఆర్టీసీ జేఎసీ నేతలు ఆదివారం నాడు ఉదయం భారీ ఊరేగింపుతో స్వగ్రామం ఆత్మకూరుకు తరలించారు. రవీందర్ మృతితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. 

రవీందర్ మృతితో పోలీసులు ముందు జాగ్రత్త చర్యల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శించారని రవీందర్ కుటుంబసబ్యులు ఆరోపిస్తున్నారు. రవీందర్ కుటుంబసభ్యులకు తెలియకుండా అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై రవీందర్ కుటుంబసభ్యులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు రవీందర్ మృతితో ఆర్టీసీ జేఎసీ నేతలు చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆత్మకూరు గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు.

అక్టోబర్ 5వ తేదీన ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెను ప్రారంభించారుమరోవైపు వేతనాలు లేక ఇంటిల్లిపాదిలి ఇబ్బందిపడాల్సి వస్తోంది. నిన్న కరీంనగర్‌‌కు నంగునూరి బాబు అనే డ్రైవర్ చనిపోయిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.గురువారం నాడు పాలమూరులో మరో డ్రైవర్ కృష్ణయ్యగౌడ్ చనిపోయారు.

మహబూబ్‌నగర్ డిపోకి చెందిన కృష్ణయ్య గౌడ్ గురువారం గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. వేతనం లేక అతని కుటుంబం ఇబ్బంది పడిందని ఆర్టీసీ నేతలు చెప్తున్నారు. 

Also Read: కేసీఆర్: ఏమైతది.. ఆర్టీసీ ఉండదు, కోదండరామ్, రేవంత్ రెడ్డిలకు రిప్లై.

కృష్ణయ్యది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని చెప్తున్నారు. కృష్ణయ్య 20 ఏళ్ల నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం బండమీదిపల్లి అని కార్మిక నేతలు తెలిపారు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం నాడు ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఖాజా అనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు.

Also Read: 5వ తేదీ అర్ధరాత్రి వరకే డెడ్‌లైన్: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఫైనల్ ఛాన్స్.