Asianet News TeluguAsianet News Telugu

5వ తేదీ అర్ధరాత్రి వరకే డెడ్‌లైన్: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఫైనల్ ఛాన్స్

యూనియన్ల మాయలో పడి కుటుంబాల్ని చెడగొట్టుకోవద్దని నవంబర్ 5లోపు బేషరతుగా ఉద్యోగాల్లో చేరాలని ఆర్టీసీ కార్మికులకు సూచించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేబినెట్ సమావేశం అనంతరం భేటీ వివరాలను ముఖ్యమంత్రి మీడియాకు వెల్లడించారు.

cm kcr announces deadline for rtc employees
Author
Hyderabad, First Published Nov 2, 2019, 8:59 PM IST

యూనియన్ల మాయలో పడి కుటుంబాల్ని చెడగొట్టుకోవద్దని నవంబర్ 5లోపు బేషరతుగా ఉద్యోగాల్లో చేరాలని ఆర్టీసీ కార్మికులకు సూచించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేబినెట్ సమావేశం అనంతరం భేటీ వివరాలను ముఖ్యమంత్రి మీడియాకు వెల్లడించారు.

ఈ అవకాశాన్ని ఆర్టీసీ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఒకవేళ ఐదవ తేదీ అర్ధరాత్రిలోగా కార్మికులు విధుల్లో చేరకపోతే మిగిలిన 5 వేల బస్సుల్ని కూడా ప్రైవేటుకిచ్చేస్తామని సీఎం హెచ్చరించారు.

ఈ అశకాశం కూడా చేజార్చకుంటే ఎవరూ ఏమీ చేయలేరని కేసీఆర్ తెలిపారు. మీ కుటుంబాలను రోడ్డున పడనివ్వొద్దని.. ఫైనల్ ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. మూడు రోజుల్లోగా ఉద్యోగంలోకి చేరి భవిష్యత్‌ను కాపాడుకోవాలన్నారు.

Also Readఆర్టీసీ విలీనం లేదు.. 5,100 ప్రైవేట్ బస్సులకు అనుమతి: సీఎం కేసీఆర్

ఐదో తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే మీకు టైమ్ ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. కేబినెట్ సమావేశంలో మొత్తం 49 మంది అంశాలపై చర్చ జరిగిందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్లు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందన్నారు.

ఆర్టీసీ కార్మికులు బాధ్యతారహితంగా సమ్మె చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. వీలినం చేయకూడదని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని.. ఇది వ్యక్తి నిర్ణయం కాదని, కేబినెట్ నిర్ణయమని సీఎం తెలిపారు.

సుధీర్ఘంగా చర్చించే విలీనం సరికాదని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ 10,400 బస్సులు నడుపుతోందని.. ఆర్టీసీ బస్సుల్లో 2,100 బస్సులు ప్రైవేట్ వ్యక్తులవేనని.. మరో 3 వేల బస్సులకు కాలం చెల్లిపోయిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

Also Read:డ్రైవర్ బాబు అంతిమయాత్ర: బీజేపీ ఎంపీ సంజయ్‌పై చేయిచేసుకున్న ఏసీపీ, ఉద్రిక్తత

ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమైనదని తేలిపోయిందని.. 49 వేలమంది కార్మికులు రోడ్డునపడే పరిస్ధితి వచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికులు ఇంకా ఆందోళన చేస్తామనడంలో అర్ధం లేదని.. ఎవరూ.. ఎవర్నీ బ్లాక్‌మెయిల్ చేసే పరిస్ధితి ఉండకూడదని కేసీఆర్ తెలిపారు.

పరీక్షలు, పండగల సమయంలో సమ్మె చేస్తామంటున్నారని.. ఆర్టీసీతో పాటు ప్రైవేట్ బస్సులు కూడా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. ఆర్టీసీ, ప్రైవేట్ ఆపరేటర్ల మధ్య పోటీ ఉండాలని కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో మేము కఠినంగా వ్యవహరించలేదని.. 4 ఏళ్లకాలంలో 67 శాతం జీతాలు పెంచిన రికార్డు టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.

4 వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేశామని.. తాము ఎవరి పొట్టా కొట్టలేదని 23 రకాల ఉద్యోగులకు జీతాలు పెంచామని.. చేనేత కార్మికుల ఆత్మహత్యల్ని తగ్గించామని ఆర్టీసీ కార్మికుల్ని తమ బిడ్డలుగానే చూస్తున్నామని కేసీఆర్ తేల్చిచెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios