హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను, తమ పోరాటాన్ని ప్రపంచానికి తెలియచేద్దామని తలపెట్టిన సభకు హాజరైన కార్మికుడు గుండెపోటుకు గురై మరణించాడు. 

వివరాల్లోకి వెళ్తే సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభకు హాజరైన కరీంనగర్ డిపోకు చెందిన డ్రైవర్ బాబు ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. సభలో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు డ్రైవర్ బాబు. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బాబు ప్రాణాలు కోల్పోయారు.  

డ్రైవర్ బాబు మరణంపై ఆర్టీసీ జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. డ్రైవర్ బాబు మరణంపై బోరున విలపించారు. సంతాపం తెలిపారు. గురువారం కరీనంగర్ బంద్ కు పిలుపునిచ్చారు ఆర్టీసీ జేఏసీ నేతలు. 

ఇకపోతే బాబు గత 25 రోజులుగా ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్నాడు. సమ్మెలో కీలక పాత్ర పోషిస్తున్న బాబు బుధవారం హైదరాబాద్ లో  జరిగిన సకల జనుల సమరభేరి సభకు హాజరై ప్రాణాలు కోల్పోయాడు. 

ఇకపోతే ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కార్యచరణ ప్రకటించారు. గురువారం ఒక్కరోజు దీక్షకు పిలుపునిచ్చారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్ తరహా ఉద్యమానికి సిద్ధం కావాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఉద్యమానికి ప్రభుత్వం దిగిరాకపోతే త్వరలోనే ట్యాంక్ బండ్ వద్ద మిలియన్ మార్చ్ కు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 

గురువారం మధ్యాహ్నాం 2గంటల నుంచి 24 గంటల దీక్షకు పిలుపునిచ్చారు అశ్వత్థామరెడ్డి. ప్రతీ ఉద్యోగి ఒక్కరోజు దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని పోరాడి సాధించుకుందామని చెప్పుకొచ్చారు. 

సమ్మె అనేది ఇల్లీగల్ కాదు అని హైకోర్టు చీఫ్ జస్టిస్ అన్నారని చెప్పుకొచ్చారు అశ్వత్థామరెడ్డి. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల మధ్య చిచ్చు పెట్టేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తాదని వాటికి అవకాశం ఇవ్వొద్దని సూచించారు. 

ఆర్టీసీవిలీనమే ప్రధాన అజెండాగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సకల జనుల సమరభేరి సభలో మాట్లాడిన ఆయన కార్మికులు అధైర్యపడొద్దని తెలిపారు. 25 రోజులుగా ఆందోళన చేస్తున్నామని మరింత ఉధృంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

దేశచరిత్రలో ఆర్టీసీ ఇలాంటి బహిరంగ సభలను నిర్వహించడం ఇదే ప్రథమం కావొచ్చన్నారు అశ్వత్థామరెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

ఆర్టీసీ కార్మికులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని కానీ కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోకూడదని ప్రయత్నిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికులు గెలుపుకోసం ప్రయత్నిస్తున్నారని చివరికి గెలుపు కార్మికులదేనన్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

త్వరలో ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్: అశ్వత్థామరెడ్డి పిలుపు

కేసీఆర్ ఒంటరి, మంత్రులు కూడా లేరు: విజయం మనదేనన్న ప్రొ.కోదండరామ్