Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్ ఎఫెక్ట్:డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్న తెలంగాణ ఆర్టీసీ

 లాక్ డౌన్ కారణంగా కోల్పోయిన ఆదాయాన్ని పొందేందుకుగాను తెలంగాణ ఆర్టీసీ ప్రయత్నాలను ప్రారంభించింది. టిక్కెట్టేతర ఆదాయంపై ఆర్టీసీ కేంద్రీకరించింది. ప్రతి ఏటా టిక్కెట్టేతర ఆదాయం రూ. 200 కోట్లు పొందేలా ఆర్టీసీ యాజమాన్యం ప్లాన్ చేస్తోంది.

RTC plans to driving training for people in Telangana
Author
Hyderabad, First Published Jul 5, 2020, 1:07 PM IST


హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా కోల్పోయిన ఆదాయాన్ని పొందేందుకుగాను తెలంగాణ ఆర్టీసీ ప్రయత్నాలను ప్రారంభించింది. టిక్కెట్టేతర ఆదాయంపై ఆర్టీసీ కేంద్రీకరించింది. ప్రతి ఏటా టిక్కెట్టేతర ఆదాయం రూ. 200 కోట్లు పొందేలా ఆర్టీసీ యాజమాన్యం ప్లాన్ చేస్తోంది.

లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణలో ఆర్టీసీ పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయింది. లాక్ డౌన్ కు ముందు ఆర్టీసీకి రోజూ రూ. 5 కోట్ల ఆదాయం వచ్చేది. లాక్ డౌన్ తర్వాత ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభించిన తర్వాత ఆర్టీసీకి రోజూ కనీసం రూ. 2 కోట్టు కూడ ఆదాయం రావడం లేదు. ఈ ఆదాయం డీజీల్ ఖర్చులకు కూడ సరిపోవడం లేదు.

also read:తెలంగాణలో రోజూ ఆర్టీసీకి రూ. 2 కోట్లు: డీజీల్‌ ఖర్చులకు కూడ చాలడం లేదు

దీంతో ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది. కార్గో సర్వీసు సేవలను ఆర్టీసీ ప్రారంభించింది. కరోనా నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేవారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో టిక్కెట్టేతర ఆదాయంపై ఆర్టీసీ కేంద్రీకరించింది.

మరో వైపు డ్రైవింగ్ స్కూల్స్ కూడ పెట్టాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తులు డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. ఇదే తరహాలో ఆర్టీసీ డ్రైవర్లతో డ్రైవింగ్ పై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇవ్వనున్నారు. 

ఒక్కొక్కరికి డ్రైవింగ్ లో 40 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ ఇచ్చినందుకు ఎంత వసూలు చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.జీహెచ్ఎంసీతో పాటు మరో రెండు రీజియన్లలో డ్రైవింగ్ శిక్షణను ఆర్టీసీ త్వరలోనే ప్రారంభించనుంది. 

మరో వైపు ఆర్టీసీ బస్ పాసు కౌంటర్లను డీజీల్ బంకులను ఔట్ సోర్సింగ్ కు ఇచ్చారు. ఈ రెండింటిని తిరిగి ఆర్టీసీ నిర్వహించాలని భావిస్తోంది. ఆర్టీసీ సిబ్బందితో వీటిని నిర్వహించనున్నారు.

ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్లు నిర్మించనున్నారు. మరోవైపు ఆర్టీసీ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించనున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో తగ్గిన ఆదాయాన్ని టిక్కెట్టేతర మార్గాల్లో సంపాదించేందుకు ఆర్టీసీ దృష్టి పెట్టింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios