ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామన్నారు టీఎస్ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. సమ్మెపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా వేసిన అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం భేషజాలకు పోకుండా కోర్టు సూచన మేరకు కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు.

విచారణ సందర్భంగా ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ వేయాలని హైకోర్టు సూచించిందని.. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించి అభిప్రాయం వెల్లడిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. తాము కూడా ముఖ్యమంత్రిని అదే కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు.

కోర్టు ఆదేశాలు, కమిటీ నిర్ణయం మాకు అంగీకారమేనని.. కమిటీకి కూడా కాలపరిమితి ఉంటుందని భావిస్తున్నట్లుగా అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కమిటీ వేస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామని.. సమ్మె చట్ట విరుద్ధమని చెప్పడానికి వీల్లేదని కోర్టు తెలిపినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. 

Also read:సుప్రీం రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేస్తాం: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీని ఎలా ఆదేశిస్తామని హైకోర్టు ప్రశ్నించింది. చట్టానికి తాము అతీతంగా ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పస్టం చేసింది. ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది.

సమ్మెలో ఉన్న కార్మికులతో చర్చలు జరపాలని  ఏ ప్రాతిపదికన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ సమ్మె విషయమై సుప్రీంకోర్టుకు చెందిన రిటైర్డ్ జడ్జిలతో కమిటీని ఏర్పాటు చేస్తామని  తెలంగాణ హైకోర్టు ప్రకటించింది

ఈ విషయమై తమ అభిప్రాయం చెబుతామని రేపు చెబుతామని అడ్వకేట్ జనరల్ ప్రకటించారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.

Also Read:ఆర్టీసీ సమ్మె... కుటుంబ పోషణ కోసం ఓ కండక్టర్ ఏం చేశాడంటే...

తాము కూడ చట్టానికి లోబడే పనిచేస్తామని హైకోర్టు చెప్పింది. చట్టానికి అతీతంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ సాగుతున్నందున తదుపరి చర్యలు తీసుకోలేకపోయినట్టుగా అడ్వకేట్ జనరల్ ప్రకటించారు.

హైకోర్టు అధికారాలు, పరిధులపై సీనియర్ కౌన్సిల్ విద్యాసాగర్ వివరణ ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె ఎస్మా పరిధిలోకి వస్తోందని విద్యాసాగర్ చెప్పారు.గతంలో ఇచ్చిన జీవోలు ఇప్పుడెలా వర్తిస్తాయని హైకోర్టు ప్రశ్నించింది. 

1998, 2015 ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 1998 ఉత్తర్వులు ఏపీఎస్‌ఆర్టీసీకే వర్తిస్తాయని చెప్పింది. టీఎస్ ఆర్టీసీకి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రశ్నించింది. 2015 ఉత్తర్వులు ఆరు మాసాలకే వర్తిస్తాయని హైకోర్టు గుర్తు చేసింది.