Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ సమ్మె... కుటుంబ పోషణ కోసం ఓ కండక్టర్ ఏం చేశాడంటే...

ఆర్టీసీ సమ్మె కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఓ కండక్టర్ కుటుంబ పోషణ నిమిత్తం కులవృత్తిని చేపట్టాడు. నిర్మల్‌ రూరల్‌ మండలం రత్నాపూర్‌ కాండ్లీకి చెందిన మహిపాల్‌ గతంలో సెలూన్‌ నిర్వహించేవాడు. 2009లో ఆర్టీసీ కండక్టర్‌గా విధుల్లో చేరాడు. అప్పటి నుంచి కులవృత్తిని వదిలేశాడు. నిర్మల్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాడు. 

RTC Conductor turns into A Hair stylist in nirmal
Author
Hyderabad, First Published Nov 12, 2019, 8:22 AM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలుపెట్టి నెల రోజులు దాటింది. ఇటు ప్రభుత్వం వారి డిమాండ్లు నెరవేర్చడానికి ముందుకు రావడం లేదు... మరో వైపు ఆర్టీసీ కార్మికులు కూడా తమ సమ్మెను విరమించడానికి ముందుకు రావడం లేదు. అరకొర ప్రైవేటు బస్సులు తిరుగుతుండటంతో ప్రజలు వాటినే నమ్ముకున్నారు. ఇదిలా ఉంటే... ఈ సమ్మె కారణంగా ఆర్టీసీ కార్మికులు కూడా నానా తిప్పలు పడుతున్నారు.

AlsoRead విరమించాలని చెప్పలేం, పరిమితులుంటాయి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు...

ఆర్టీసీ సమ్మె కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఓ కండక్టర్ కుటుంబ పోషణ నిమిత్తం కులవృత్తిని చేపట్టాడు. నిర్మల్‌ రూరల్‌ మండలం రత్నాపూర్‌ కాండ్లీకి చెందిన మహిపాల్‌ గతంలో సెలూన్‌ నిర్వహించేవాడు. 2009లో ఆర్టీసీ కండక్టర్‌గా విధుల్లో చేరాడు. అప్పటి నుంచి కులవృత్తిని వదిలేశాడు. నిర్మల్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాడు. 

వచ్చే జీతంలో ఇంటి కిస్తీలు చెల్లిస్తూ.. పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు. అప్పటికే నెల జీతం రావాల్సి ఉంది. సమ్మె కారణంగా మరో నెల జీతం రాకుండా పోయింది. రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఏం చేయాలో పాలుపోక కులవృత్తి అయిన.. తనకు వచ్చిన పనిని చేపడుతున్నాడు. సమస్యల పరిష్కారం కోసం అటు సమ్మెలో పాల్గొంటూ.. కుటుంబ పోషణ కోసం కులవృత్తిని చేపడుతున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios