తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం జరగనున్న తెలంగాణ బంద్ విజయవంతం చేయాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో పోలీసులు జేఏసీ నేతలను అడ్డుకుని అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీఎస్ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని.. మంత్రులు మాతో టచ్‌లోనే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని అశ్వద్ధామరెడ్డి హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలిచిన ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా అంటూ ఆయన గుర్తు చేశారు.

ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటోంది కార్మికులు కాదని నాయకులు సమ్మె చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానిస్తున్నారని అశ్వద్దామరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు పోరాడాడని గుర్తు చేశారు.

ఉద్యమ స్ఫూర్తితోనే కొట్లాడుతామని.. తమ హక్కులు సాధించుకుంటామని అశ్వద్ధామరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పునాదులు కదిలితే ఏమైనా జరగొచ్చని కేసీఆర్.. ఎన్టీఆర్ కంటే ఛరిష్మావున్న నేత కాదని అశ్వద్ధామ వ్యాఖ్యానించారు. 

కోర్టు ముందుకు నేడు ఆర్టీసి సమ్మె: అంతు చిక్కని కేసీఆర్ వ్యూహం

గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన తన టెలిఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మె పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం అవుతోందని ఆయన జోస్యం చెప్పారు. ఆర్టీసీ సమ్మెపై మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి  సమ్మె చేస్తున్నారు.  సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఈ  నెల 6వ తేదీలోపుగా విదుల్లో చేరని వారంతా సెల్ప్ డిస్మిస్ అయ్యారని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

మరోవైపు ఆర్టీసీ సమ్మెతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆమె గురువారం ఆరా తీశారు. దీంతో రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గురించి వివరించారు.

RTC Strike: చట్టాల్లో సెల్ప్ డిస్మిస్ ఉందా? ఆరా తీసిన తమిళిసై

సామాన్యులు ఇబ్బందులు పడకుండా చూస్తున్నామని ఆయన గవర్నర్‌కు తెలిపారు. ఈ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సునీల్ శర్మను తమిళిసై ఆదేశించారు. సమ్మెపై ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయన్నారు. 

గురువారం నాడు మధ్యాహ్నాం గవర్నర్ సౌందరరాజన్  తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేశారు. ఆర్టీసీ సమ్మె గురించి గవర్నర్ వివరాలు తెలుసుకొన్నారు. ఈ సమయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం కేసీఆర్ వద్ద సమీక్ష సమావేశంలో ఉన్నారు.