ఆర్టీసీ ఉద్యోగులకు పండగ వేళ యాజమాన్యం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇటీవల... ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ దాదాపు 55 రోజులపాటు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా... ఆ సమ్మె చేసిన రోజులకు జీతం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

సంక్రాంతికి నాలుగు రోజుల ముందు అనగా ఈ నెల 11న ఉద్యోగుల ఖాతాల్లో 55 రోజుల వేతనాన్ని వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఆర్టీసీ వెల్ఫేర్ బోర్టులో  202 మంది సభ్యులను నియమిస్తూ సర్కులర్ జారీ చేశారు. ప్రతి డిపో నుంచి సభ్యుడు ప్రాతినిథ్యం వహించేలా నియామకాలు జరిగాయి. రీజియన్ మేనేజర్లు సదరు సభ్యులను నామినేట్ చేశారు. 

AlsoRead సీఎంగా కేటీఆర్ పక్కా: వరంగల్ పర్యటన తీరు చూస్తే..

వీరు ఆ డిపో పరిధిలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా పనిచేయనున్నారు. ఇక అక్టోబర్ నెలకు సంబంధించిన అద్దె బస్సుల బకాయిలను యాజమాన్యం చెల్లించింది. మూడు నెలలుగా బిల్లులు పెండింగ్ పెట్టడంతో, బస్సులను నిలిపివేస్తామని అద్దె బస్సుల ఓనర్లు ఈడీకి లేఖ రాశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్టోబర్ నెలకు సంబంధించిన బకాయిలు రూ. 20 కోట్లు  ఆర్టీసీ యాజమాన్యం రిలీజ్ చేసింది.