Asianet News TeluguAsianet News Telugu

హైకోర్టు ఏమైనా కొడతదా..? : సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

హైకోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఏమైనా ప్రభుత్వాన్ని కొడతాదా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల వేసిన పిటీషన్లపై హైకోర్టు తీర్పు ఇచ్చే అధికారం చెప్పుకొచ్చారు. తమకు వారిపట్ల సానుకూలంగా చూడాలంటూ సూచనలు మాత్రమే చేయగలదన్నారు. 

telangana cm kcr interesting comments on high court
Author
Hyderabad, First Published Oct 24, 2019, 6:21 PM IST

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో యూనియన్ నేతలు హైకోర్టును ఆశ్రయించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తీర్పు చెప్పే అధికారం హైకోర్టుకు లేదని స్పష్టం చేశారు. 

హైకోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఏమైనా ప్రభుత్వాన్ని కొడతాదా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల వేసిన పిటీషన్లపై హైకోర్టు తీర్పు ఇచ్చే అధికారం చెప్పుకొచ్చారు. తమకు వారిపట్ల సానుకూలంగా చూడాలంటూ సూచనలు మాత్రమే చేయగలదన్నారు. 

హైకోర్టు సూచనల అనంతరం కేసు కాస్త లేబర్ కోర్టుకు వెళ్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. మెుత్తానికి చట్టాన్ని ఉల్లంఘించి ఎస్మా ఉన్న సమయంలో సమ్మెకు వెళ్లడం క్రిమినల్ చర్య అంటూ కేసీఆర్ ఆరోపించారు. 

ఇకపోతే రెండోసారి నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత ప్రైవేట్ బస్సులు కొనుగోలు, ప్రజా రవాణా వ్యవస్థలో ప్రైవేట్ బస్సులను భాగస్వామ్యం చేసే అధికారం ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆ చట్టం దేశవ్యాప్తంగా అమలులో ఉందని చెప్పుకొచ్చారు. 

ఆర్టీసీపై నియంత్రణ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకే బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుందని ఈ నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వమే తీసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.  

మెడమీద తలకాయ ఉన్నవాళ్లెవరూ ఇలాంటి సమ్మెలు చేయలేరని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అక్రమమని, అదోక క్రిమినల్ యాక్టివిటీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్మా ఉండగా సమ్మెకు వెళ్లడం ఎంత వరకు కరెక్ట్ అన్నారు.  

రాష్ట్రంలో 2600 బస్సులు రీప్లేస్‌మెంట్‌ చేయాల్సిన అవసరం ఉందని, వాటికి రూ. వెయ్యి కోట్లు అవసరమన్నారు. పాత ఆర్టీసీ బతికిబట్టగట్టే పరిస్థితి లేకుండా యూనియన్లు చేశాయని, యూనియన్ల చిల్లరరాజకీయాలతో ఆర్టీసీకి భవిష్యత్‌ ఉండదని తేల్చి చెప్పారు కేసీఆర్.
 
ఆర్టీసీ యూనియన్ల పేరుతో వాళ్లు చేస్తుంది మహానేరమని మండిపడ్డారు. జీవితాలతో ఆడుకుంటున్నారని, కార్మికుల గొంతు కోస్తున్నారని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రిగానీ, మంత్రులు గానీ ఎవరూ ముంచలేదన్నారు. 

ఆర్టీసీని కాపాడకుండా అన్నంపెట్టిన కొమ్మనే నరుక్కునేది ఆర్టీసీ  కార్మికులు అంటూ చెప్పుకొచ్చారు కేసీఆర్. ఒక్క బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే ఉన్నప్పుడు ఫోన్‌ కనెక్షన్‌ కావాలంటే నెలలు పట్టేదని, ప్రైవేట్‌ సంస్థలు వచ్చాక సదుపాయాలు పెరిగాయని తెలిపారు.

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు ఉండాలంటే పోటీ ఉండాల్సిందేనన్నారు. ప్రైవేట్‌ బస్సుల పోటీని తట్టుకుని నిలబడితేనే ఆర్టీసీ మిగులుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు అనే ప్రసక్తే లేదన్నారు.

తాము ఐఏఎస్ అధికారుల కమిటీ వేశామని వారు సక్రమంగా స్పందించకుండా రోడ్డుమీద పడ్డారని చెప్పుకొచ్చారు. ఆర్టీసీని కాపాడే పరిస్థితి ఎవరికీ లేదన్నారు. అది ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు సీఎం కేసీఆర్. 

తాము గొంతుకోసుకుంటాం, సమ్మె ఆగదు అని పదేపదే ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారని వారే ముందుకు రాకపోతే తాము ఏం చేయాలని నిలదీశారు. ప్రభుత్వ అధినేతను తిడుతూనే తమతో చర్చలు జరపాలని కోరతారా అంటూ మండిపడ్డారు. 

యూనియన్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలన్నారు. సమ్మె నేథ్యంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు సరికాదన్నారు. ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఆర్టీసీ నాయకులు బాధ్యతగా మెలగాల్సింది పోయి రాజకీయ నాయకుల్లా మాట్లాడతారా అంటూ తిట్టిపోశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios