తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు చెందిన బస్సుల తనిఖీ చేపడుతున్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి నిబంధనలకు అనుగుణంగా లేని బస్సులను సీజ్‌ చేస్తున్నారు. వనస్థలిపురంలో ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేపట్టిన రవాణా శాఖ అధికారులు.. నిబంధనలు పాటించని 2 బస్సులను సీజ్ చేశారు. మరోవైపు రాజేంద్రనగర్‌లో జరిపిన తనిఖీల్లో.. నిబంధనలు పాటించని 6 బస్సులను సీజ్ చేశారు. 

ఇదిలా ఉంటే.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు పునఃప్రారంభమయ్యాయి. అయితే రాష్ట్రంలో వర్షాలు, ఎండలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగించినట్లు వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నట్లు చాలా పాఠశాలలు పునరుద్ఘాటించాయి.