టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను 48 గంటల్లో రద్దు చేయకపోతే అమరణ నిరహార దీక్షకు దిగుతాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.
టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష 48 గంటల్లో రద్దు చేయకపోతే అమరణ నిరహార దీక్షకు దిగుతాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఈరోజు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తాను కూడా టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా పని చేశానని వెల్లడించారు. చైర్మన్ కు తప్ప మరెవరికి తెలియని పాస్వర్డ్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల వద్దకు ఎలా వెళ్ళిందని ప్రశ్నించారు. దొంగిలించేంత ఈజీగా పాస్‌వర్డ్ బయటపెడతారా? అని ప్రశ్నించారు. 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు దీనితో ముడిపడి ఉన్నాయని అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరుతున్నట్టుగా చెప్పారు.
ప్రియురాలి కోసం లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టిన టీఎస్‌పీఎస్సీ సెక్రెటరీ పీఏ ప్రవీణ్ ఒక జులాయి, ఘోర నేరస్తుడని విమర్శించారు. అతడికి గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలో 150 కి 103 మార్కులు ఎట్లొస్తాయని ప్రశ్నించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100 మార్కులు దాటిన అభ్యర్థుల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో తాను కూడా టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా పని చేశానని వెల్లడించారు. చైర్మన్ కు తప్ప మరెవరికి తెలియని పాస్వర్డ్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల వద్దకు ఎలా వెళ్ళిందని ప్రశ్నించారు. దొంగిలించేంత ఈజీగా పాస్‌వర్డ్ బయటపెడతారా? అని ప్రశ్నించారు. దీనిపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరుతున్నట్టుగా చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి దీని గురించి మాట్లాడటని, రోజు ట్వీట్‌లు పెట్టే కేటీఆర్ దీని గురించి ట్వీట్ చేయడని విమర్శించారు. నిరుద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని చెప్పారు. దీనిని సిట్‌కు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఈ వ్యవహారానికి సంబంధించి తాను త్వరలోనే రాష్ట్రపతికి, గవర్నర్‌కు లేఖలు రాయనున్నట్టుగా చెప్పారు. తప్పకుండా సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీని వెనక పెద్దలు ఉన్నారని ఆరోపించారు.
గ్రూప్-1 మెయిన్స్‌కు ప్రిపేర్ అవ్వమని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ అభ్యర్థులకు చెప్పడం సరికాదని అన్నారు. టీఎస్‌పీఎస్సీ మీద రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోయిందని అన్నారు. కొత్త బాడీని నియమిచాలని.. అన్ని పరీక్షలు మళ్లీ పెట్లాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను 48 గంటల్లో రద్దు చేసి.. మళ్లీ పెడతామని ప్రకటన చేయకుంటే 30లక్షల మంది నిరుద్యోగుల కోసం తాను హైదరాబాద్ నడిబొడ్డున అమరణ నిరహార దీక్షకు దిగుతానని చెప్పారు.
