ఐటీ శాఖలో రీఫండ్ స్కాం: ఏపీ, తెలంగాణల్లో ఐటీ అధికారుల సోదాలు
ఆదాయపన్ను శాఖ లో రీఫండ్ కుంభకోణంపై ఐటీ శాఖాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: ఆదాయపన్ను శాఖలో రీఫండ్ కుంభకోణంపై ఐటీ శాఖాధికారులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారంనాడు సోదాలు నిర్వహిస్తున్నారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఆదాయపన్ను శాఖ నుండి రీఫండ్స్ పొందినట్టుగా ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ఐటీ రీఫండ్స్ స్కాంలో చార్టెడ్ అకౌంటెంట్స్ కీలకంగా వ్యవహరించారని ఐటీ శాఖాధికారులు గుర్తించారు.
also read:ఆదాయపన్ను రీఫండ్ స్కాం:హైద్రాబాద్, విజయవాడల్లో ఐటీ అధికారుల తనిఖీలు
హైద్రాబాద్ లోని ఎనిమిది చోట్ల ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విజయవాడ, విశాఖ, హైద్రాబాద్, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ట్యాక్స్ రీఫండ్ పేరుతో రూ. 40 కోట్లు స్వాహా చేశారని సమాచారం. అయితే ఇంతకంటే ఎక్కువే నిధులు స్వాహా చేశారనే అనే అనుమానంతో ఐటీ శాఖాధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉందనే అనుమానంతో పలు ప్రాంతాల్లోని ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.