ఘరానా మోసం.. వత్తుల తయారీ పేరిట రూ.20 కోట్లు టోకరా...

హైదరాబాద్ లో భారీ మోసం బయటపడింది. ఓ వ్యక్తి వత్తుల తయారీ పేరుతో జనాల్సి నిలువుదోపిడీ చేశాడు. అతడిని నమ్మి డబ్బులు పెట్టినందుకు రూ.20 కోట్లు నష్టపోయారు. 

Rs. 20 Crores  fraud in the name of Vattulu manufacturing in Hyderabad

హైదరాబాద్ : నమ్మించి మోసం చేయడం.. అధిక డబ్బు వస్తుందని ఆశ చూపించి వలలో వేసుకోవడం నేటి రోజుల్లో ఇలాంటి ఘరానా కేటుగాళ్లు ఎక్కువైపోయారు. అలాంటి ఓ భారీ ఘరానా మోసం హైదరాబాద్ లో జరిగింది. ఒత్తుల తయారీ పేరుతో ఓ వ్యక్తి ఏకంగా రూ.20 కోట్లు మోసం చేశాడు. దీంతో ఒత్తుల తయారీతో ఉపాధి పొందొచ్చు అని భావించిన వందలాదిమంది నిలువునా మోసపోయారు. తాము మోసపోయిన విషయం తెలుసుకుని డిపాజిట్ల పేరుతో చెల్లించిన సొమ్మును తిరిగి ఇప్పించాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అక్కడ స్పందన లేకపోవడంతో.. నిందితుడి నివాసం ఎదుట బాధితులంతా నిరసనకు దిగారు.  

హైదరాబాద్ నగర శివారు బోడుప్పల్ లో జరిగిన ఈ భారీ మోసం చర్చనీయాంశంగా మారింది. బోడుప్పల్ కు చెందిన ఏబీజీ మాన్యూఫ్యాక్చరింగ కంపెనీ యజమాని బాలస్వామిగౌడ్. ఈ ఏడాది ఫిబ్రవరిలో దూది వత్తులు తయారీ పేరిట ‘ఎదుల’ అనే సంస్థను ప్రారంభించాడు. తయారీకీ తానే దూది, యంత్రాలను సరఫరా చేస్తానని,  ఇంట్లో ఉంటూనే ప్రతినెల రూ. 30,000-40,000  పొందవచ్చు అంటూ విస్తృతంగా ప్రచారం చేశాడు. ఈ క్రమంలో కిలో పత్తి రూ.300చొప్పున అమ్మాడు. రూ.300 కొన్న పత్తిని.. వత్తులుగా మార్చితే కిలో రూ. 600 చొప్పున తానే కొనుకోలు చేస్తానంటూ నమ్మబలికాడు.

అయితే, దీనికోసం డిపాజిట్ గా రూ.1.70 లక్షలు చెల్లిస్తే మెషనరీ, పత్తి తదితర ముడిసరుకు ఇస్తానని ఆర్నెల్ల తర్వాత డిపాజిట్ సొమ్మును కూడా వెనక్కి ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు.  అతని మాటలను నమ్మిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అనేక మంది యువకులు, మహిళలు  ఇందులో చేరడం కోసం పోటీ పడ్డారు. దాదాపుగా 800-1000 మంది వరకూ మెషినరీ  కొనుగోలు చేశారు.  సుమారు రూ.15-20  కోట్ల మేర వసూలు అయ్యాయి. అనుకున్నది సక్సెస్ అయ్యింది. ఇంకేముంది.. బాల స్వామి గౌడ్ ఆ తర్వాత ముఖం చాటేశాడు.

వైసిపీకి అమ్మ రాజీనామాపై వైఎస్ షర్మిల షాకింగ్ రియాక్షన్

ఒట్టి ఒత్తులే కాదు.. ఫినాయిల్, శానిటైజర్ తయారీ పేరిట కూడా మోసాలకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. అతని మాటలు నమ్మి దళిత బంధు డబ్బు తీసుకొచ్చి పెట్టినట్లు రమేష్ అనే బాధితుడు ఆవేదన వెలిబుచ్చాడు. మిగతా వారిది కూడా ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన కథ. డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని ఆశపడితే అడ్డంగా బుక్కయ్యారు.

ఫిర్యాదు చేసిన స్పందించలేదు…
తాము డిపాజిట్లు కట్టిన తరువాత.. మెషినరీ కోసం వెడితే.. బోడుప్పల్ లోని బాల స్వామి గౌడ్ ఇల్లు కార్యాలయానికి తాళం వేసి ఉంది. దీంతో నాలుగైదు రోజులు గమనించిన బాధితులు గత నెల 27న మేడిపల్లి పోలీస్ స్టేషన్లో దీని మీద ఫిర్యాదు చేశారు. అయితే ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో బాధితులు ఆందోళనకు దిగారు.  విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని నిరసనకారులను  మేడిపల్లి ఠాణాకు తరలించారు. మల్కాజిగిరి ఏసీబీ శ్యామ్ సుందర్ రావు ఘటనా స్థలాన్ని సందర్శించి ఆందోళనకారులను శాంతింపజేశారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios