ఐటీ దాడులు: మంత్రి మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి నివాసంలో రూ. 2 కోట్లు సీజ్

తెలంగాణ  మంత్రి  మల్లారెడ్డి బంధువు నివాసంలో  రూ. 2  కోట్ల  నగదును  ఐటీ  అధికారులు  సీజ్  చేశారు. ఉదయం నుండి  త్రిశూల్  రెడ్డి  నివాసంలో  ఐటీ  అధికారులు  సోదాలు  చేస్తున్నారు. 

Rs. 2 Crore unaccounted money seized Telangana Minister Malla Reddy relative house

హైదరాబాద్:తెలంగాణ మంత్రి  మల్లారెడ్డి  బంధువు  త్రిశూల్ రెడ్డి  ఇంట్లో రూ. 2 కోట్ల విలువైన నగదును  ఐటీ  అధికారులు  మంగళవారంనాడు  సీజ్  చేశారు.ఇవాళ ఉదయం నుండి  మంత్రి మల్లారెడ్డి  సహా  ఆయన  బంధువులు, కుటుంబ సభ్యుల  ఇళ్లలో  ఐటీ  అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  త్రిశూల్  రెడ్డి  నివాసంలో  రూ. 2  కోట్ల  నగదును ఐటీ  అధికారులు  సీజ్ చేశారు. ఇవాళ  ఉదయం నుండి  మంత్రి  మల్లారెడ్డితో పాటు  ఆయన  బంధువులు,  కుటుంబసభ్యుల  ఇళ్లలో  ఐటీ  అధికారులు  సోదాలు  నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే  ఇవాళ  ఉదయం నుండి  త్రిశూల్  రెడ్డి  ఇంట్లో  సోదాలు  చేస్తున్నారు. మధ్యాహ్నానికి  రూ. 2  కోట్లు  సీజ్  చేశారు.

 త్రిశూల్ రెడ్డి  పలు  కాలేజీలను  నిర్వహిస్తున్నారని సమాచారం. సుచిత్రలో  నివాసం ఉంటున్న  త్రిశూల్  రెడ్డి నివాసంలో  రూ. 2 కోట్లు సీజ్ చేశారు  అధికారులు. త్రిశూల్  రెడ్డి  పలు  కాలేజీలు  ఉన్నట్టుగా  ఐటీ  అధికారులు  చెబుతున్నారునరసింహరెడ్డి  కాలేజీల్లో  త్రిశూల్ రెడ్డి  డైరెక్టర్ గా  కొనసాగుతున్నారు. అంతేకాదు  మంత్రి  మల్లారెడ్డి కి  త్రిశూల్  రెడ్డి  సమీప బంధువు.  త్రిశూల్  రెడ్డికి  చెందిన  ఫోన్ ను  కూడా  ఐటీ  అధికారులు సీజ్  చేశారు.  మంత్రి  మల్లారెడ్డికి, త్రిశూల్  రెడ్డికి  మధ్య  సంబంధాలపై  ఐటీ  అధికారులు ఆరా  తీస్తున్నారు. 

మంత్రి  మల్లారెడ్డి  తనయుడు  మహేందర్  రెడ్డికి  సన్నిహితుడిగా  ఉన్న సంతోష్  రెడ్డి  ఇంటి లోపలికి  వెళ్లేందుకు  ఐటీ  అధికారులు  ప్రయత్నిస్తున్నారు.  సంతో
ష్  రెడ్డి  తలుపులు  ఓపెన్  చేయకపోవడంతో  తలుపులు  బద్దలు కొట్టి  లోపలికి  వెళ్లాలని  అధికారులు  ప్రయత్నిస్తున్నారు.  మల్లారెడ్డికి  చెంందిన  ఆర్ధిక  వ్యవహరాలను  సంతోష్  రెడ్డి  చూస్తారని  తెలుస్తుంది.  సంతోష్  రెడ్డి ఇంట్లో  సోదాలు నిర్వహిస్తే  కీలక  విషయాలు బయటకు  వచ్చే  అవకాశం  ఉందని  ఐటీ  అధికారులు భావిస్తున్నారు.

also  read:మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు: ఫోన్ స్వాధీనం, లాకర్ పగులగొట్టిన అధికారులు

మంత్రి మల్లారెడ్డి నివాసాల్లో  సోదాలు  నిర్వహించిన సమయంలో  ఐటీ  అధికారులు కీలక  అంశాలను  గుర్తించారు. మంత్రి మల్లారెడ్డితో  పాటు  సీఎంఆర్  స్కూల్స్ కు  చెందిన  నరసింహ యాదవ్  ఎనిమిది  విద్యాసంస్థల్లో  భాగస్వామ్యం  కలిగి  ఉన్నట్టుగా  ఐటీ  అధికారులు  గుర్తించారు. జైకిషన్  తండ్రే  నరసింహ యాదవ్.జైకిషన్,మాధవరెడ్డి,  చీకోటి  ప్రవీణ్  కుమార్  లు  క్యాసినో లో పెట్టుబడులు  పెట్టారు.  గతంలో  జైకిషన్  నివాసంలో  ఐటీ  అధికారులు సోదాలు  నిర్వహించారు. 

ఇవాళ  ఉదయం  నుండి  మంత్రి మల్లారెడ్డి  నివాసాల్లో  ఐటీ  అధికారులు సోదాలు  చేస్తున్నారు.  మల్లారెడ్డి  సోదరుడు , కొడుకులు, అల్లుళ్ల  ఇళ్లలో  ఐటీ  అధికారులు  సోదాలు  నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి  కూతురు,  అల్లుడు  విదేశీ  పర్యటనలో  ఉన్నారు. మల్లారెడ్డి  సోదరుడి  ఇంట్లో  రెండు  లాకర్లను  ఐటీ  అధికారులు  ఓపెన్  చేశారు. మరో వైపు  ఎలక్ట్రానిక్ లాకర్లను ఓపెన్  చేసేందుకు  ఐటీ  అధికారులు  ప్రయత్నిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios