శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ సీజ్
శంషాబాద్ ఎయిర్ పోర్టులో దుబాయ్ కు వెళ్తున్న ప్రయాణీకుడి నుండి అధికారులు విదేశీ కరెన్సీని సీజ్ చేశారు.
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో దుబాయ్ కు వెళ్తున్న ప్రయాణీకుడి నుండి రూ. 2 కోట్ల 40 లక్షల విలువైన విదేశీ కరెన్సీని పోలీసులు మంగళవారంనాడు సీజ్ చేశారు. దుబాయ్ కు వెళ్లే ప్రయాణీకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
హైద్రాబాద్ నుండి దుబాయ్ కు వెళ్తున్న ప్రయాణీకుడిని ఎయిర్ పోర్టు సిబ్బంది ప్రశ్నించారు. అతని నుండి దుబాయ్ కు చెందిన కరెన్సీని రూ. 11 లక్షలు అధికారులు సీజ్ చేశారు. దీని విలువ ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 2.40 కోట్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇంత పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీని ఉంచుకోవడం చట్ట విరుద్దమని అధికారులు చెబుతున్నారు. దుబాయ్ కు వెళ్లే ప్రయాణీకుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్ డేటా ను పరిశీలిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ ఎలా వచ్చిందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.గతంలో కూడా విదేశీ కరెన్సీని శంషాబాద్ ఎయిర్ పోర్టు లో ప్రయాణీకుల నుండి సీజ్ చేశారు.