నల్గొండ జిల్లా చిట్యాలలో మాస్కులు ధరించకుండా కరోనా నిబంధనలు అతిక్రమించిన వారికి ఫైన్ లు వసూలు చేస్తున్నారు. చిట్యాల మున్సిపల్ అధికారులు, పోలీస్ సిబ్బంది కలిసి చిట్యాల సెంటర్ లో మాస్కులు ధరించని వాహనదారుపైన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఒక్కొక్కరికి 1000/- జరిమానా విధించారు.

ఇక పై బహిరంగ ప్రదేశాలలో మాస్కులు లేకుండా కనబడినట్లయితే వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాపారస్తులు కూడా మాస్క్ ఉంటేనే కస్టమర్లను షాపుల్లోకి అనుమతించాలని, దీన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. 

కోవిడ్ ని అరికట్టడంలో ప్రజలందరూ సహకరించాలని, కోవిడ్ నిబంధనలు పాటించని వారిపైన క్రిమినల్ కేసులు కూడా తప్పవని హెచ్చరించారు.

తెలంగాణలో కొత్త రూల్... మాస్క్ లేకుండా బయట అడుగుపెడితే.....

కాగా ఏప్రిల్ ఒకటినుండి తెలంగాణ రాష్ట్రంలో మాస్క్​ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మాస్క్​ ధరించకుంటే జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించి, ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనను శుక్రవారం, ఏప్రిల్ 2 నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఆదేశాలిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్​ ధరించకుంటే ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని, కోర్టులో హాజరుపర్చాలని పేర్కొంది.