తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పేందుకు ప్రభుత్వ పెద్దలు ఎకరం రూ.100 కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. ధరణిని పేదల కోసం తీసుకురాలేదని అన్నారు. దానిని పెద్దల కోసమే తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.
భూములు అమ్మకూడదని గతంలో అందరం అసెంబ్లీలో ఫ్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశామని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మరి నేడు వాటిని ఎలా అమ్ముతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పేందుకే ఎకరం భూమి రూ.100 కోట్లని ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లు : ఆప్ కోసమే కాంగ్రెస్ ఎత్తుగడ - అమిత్ షా
అసెంబ్లీపై సీఎం కేసీఆర్ కు నమ్మకం తగ్గిందని ఈటల ఆరోపించారు. ఈ ఏడాది అసెంబ్లీ సమావేశాలు 14 మాత్రమే జరిగాయని తెలిపారు. కానీ ఉమ్మడి ఏపీలో ఏడాదికి 60 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగేవని చెప్పారు. గతంలో 15 పార్టీలుంటే నేడు 4 పార్టీలే ఉన్నాయని అన్నారు. అన్ని పార్టీలతో బీఏసీ సమావేశం కొనసాగేదని, కానీ నేడు జాతీయ పార్టీగా ఉన్న బీజేపీకి కూడా బీఏసీకి ఆహ్వానం అందలేదని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ఒక గది కేటాయించాలని కోరామని, కానీ నెరవేరడం లేదని తెలిపారు. పేదల కోసం ధరణి తీసుకురాలేదని, పెద్దల కోసమే దానిని తీసుకొచ్చారని ఈటల రాజేందర్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
కోరుట్లలో కౌన్సిలర్ భర్తను నరికేసిన దుండగులు.. బైక్ వచ్చి దారుణం..
శాసన సభలో స్పీకర్ తమకు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులకంటే ఎంఐఎం నాయకులు పొగడటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇటీవల వచ్చిన వరదల్లో 41 మంది కొట్టుకుపోయారని, ప్రభుత్వం వారికి సంతాపం కూడా తెలుపలేదని ఆరోపించారు. శాసన సభ మూడు రోజుల పాటు సాగిందని, అందులో అధిక సమయం ప్రతిపక్షాలపై విరుచుకుపడేందుకు అధికార పార్టీ నాయకులు ఉపయోగించారని అన్నారు.
