హైదరాబాద్ మహానగర పాలకసంస్థ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ గ్రేటర్ లో ఓ వ్యక్తి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. దీనిమీద వివాదం చెలరేగడంతో ఆ వ్యక్తికి జీహెచ్ఎంసీ ఈవీడీఎం అధికారులు జరిమానా విధించారు. 

గ్రేటర్ లో మేయర్ విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ అతిష్ అగర్వాల్  అనే వ్యక్తి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అయితే ఈ ఫ్లెక్సీలు అనాధికారికంగా ఏర్పాటు చేశారని నగర పౌరుడు ట్విటటర్ వేదికగా ప్రశ్నించాడు. 

దీంతో అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే ఫ్లెక్సీని తొలగించి, అవి ఏర్పాటు చేసిన అతిష్ అగర్వాల్ కు రూ. లక్ష జరిమానా విధించారు. అనధికారికంగా ఇలాంటి పనులు చేసేవారికి కఠిన చర్యలు తప్పవంటూ ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.