వత్తులు, బొట్టు బిళ్లల తయారీ పేరుతో రూ.200కోట్ల భారీ స్కాం..
దీపం వెలిగించే వత్తులు, బొట్టు బిళ్లల తయారీతో స్వయం ఉపాధి సాధించొచ్చని.. ఎరవేసి ఏకంగా రూ.200 కోట్ల రూపాయల మోసం చేసిన కేసు హైదరాబాద్ లో వెలుగు చేసింది.
హైదరాబాద్ : వస్తువు చిన్నదే.. కానీ స్కాం పెద్దది. నిత్యం ఇంట్లో తప్పనిసరిగా వాడే దీపం వత్తులు, మహిళలు నిత్యం ధరించే బొట్టు బిళ్ళల తయారీతో లాభాలు పొందవచ్చని మోసం చేశారు. అది కూడా ఇంట్లోనే ఉంటూ నెలకు వేలాది రూపాయలు సంపాదించవచ్చని పేద, నిరుద్యోగ, మధ్యతరగతి మహిళలకు ఎర వేశాడు ఓ కేటుగాడు. అతడిని నమ్మిన వారిని నిలువునా ముంచేశాడు. వత్తులను తయారు చేసే మిషన్ లను అంటగట్టాడు. అతడిని నమ్మిన వందలాది మంది నుంచి డిపాజిట్ల పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నాడు. ఈ మొత్తం అక్షరాల రూ.200 కోట్లు ఉంటుందని పోలీసుల ప్రాథమిక అంచనా.
సోమవారం హైదరాబాదులోని ఏఎస్ రావు నగర్లో ఈ భారీ మోసం వెలుగు చూసింది. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా రాచర్ల కు చెందిన రావులకొల్లు రమేష్ (30) అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. అతను ఏ ఎస్ రావు నగర్ లోని ఆర్కెడ్ అపార్ట్మెంట్లో ఆర్ ఆర్ ఎంటర్ప్రైజెస్ అనే పేరుతో దీపం వత్తులు, బొట్టు బిల్లలు తయారుచేసే సంస్థను ప్రారంభించాడు.
ఉద్యోగం లేకుండా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నిరుద్యోగ యువత, ఖాళీ సమయాల్లో ఇంట్లోనే ఉండి మహిళలు ఈ పని ద్వారా.. వేలాది రూపాయలు సంపాదించవచ్చని యూట్యూబ్ లో ఒక వీడియో చేసి.. యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. దీన్ని ప్రచార సాధనంగా వాడుకున్నాడు. ఇది చూసిన చాలామంది దానికి ఆకర్షితులై ఆ స్కీం లో చేరారు. అలా చేరిన వారికి రమేష్ రెండు రకాల యంత్రాలను అమ్మాడు. ఒక్కో దానికి రూ. 1.20 లక్షల నుంచి రూ.2.60 లక్షల వరకు వసూలు చేశాడు. దీంతోపాటు పొత్తుల తయారీకి అవసరమైన దూదిని కూడా రమేష్ సరఫరా చేసేవాడు.
సైకో, సతాయిస్తాడు.. సూసైడ్ లెటర్ రాసి హెడ్ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య..
తాను ఇచ్చిన దూదితో ఒత్తులు తయారుచేసి ఇస్తే అతనే కొనే వాడు. కిలో కి రూ. 300 చొప్పున చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అలా కొద్ది నెలలు వ్యాపారం బాగానే జరిగింది. దీంతో ఆ నోటా ఈ నోటా ఇది బాగా ప్రచారం అయింది. అలా చాలా మందికి తెలిసింది. ఒకరి ద్వారా ఒకరు చేను లింకుతో పెద్ద సంఖ్యలో ఈ స్కీంలో చేరారు. అందరికీ తన దగ్గరున్న ఒత్తులు తయారీ, బొట్టు బిళ్ళ ల తయారీ మిషన్లను అంటగట్టాడు. ఆ తర్వాత అందరూ తనను నమ్ముతున్నారనుకున్న తర్వాత తాను ముందే స్కెచ్ వేసిన మోసానికి తెరతీశాడు.
అంతే డబ్బులు ఇవ్వడం మానేశాడు. మూడు నెలలుగా ఇదే తంతు. డబ్బులు అడిగితే అదిగో ఇదిగో అంటూ వాయిదా వేస్తూ వస్తున్నాడు. దీంతో వత్తుల తయారీ దారులు విసిగిపోయారు. నేరుగా ఆఫీసుకు వచ్చి అక్కడ సిబ్బందిని నిలదీశారు. అలా రోజురోజుకు వచ్చేవారి సంఖ్య పెరుగుతూ పోయింది. ఇలాగైతే తన మోసం బయటపడుతుందని అనుకున్న రమేష్ రాత్రికి రాత్రే పారిపోయాడు. పారిపోయాడు. సోమవారం ఉదయం దాదాపు 30 మంది బాధితులు ఆఫీసుకు వచ్చారు. అయితే అక్కడ ఎవరూ కనిపించలేదు. దీంతో వారికి అనుమానం వచ్చింది. రమేష్ కి, ఆఫీస్ సిబ్బందికి ఫోన్ చేశారు. కానీ ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. దీంతో వారు తమ మోసపోయామని తెలుసుకున్నారు. దీంతో అందరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు.