Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాల బీట్ బజార్ లో చికెన్ కొట్టే కత్తితో.. రౌడీ షీటర్ హత్య (వీడియో)

నిన్న రాత్రి బీట్ బజార్ లో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో చికెన్ కొట్టే కత్తితో శేఖర్ ను దుండగుడు stabbed to death. ఈ హత్యకు పాత కక్షలే కారణమని  స్థానికులు అంటున్నారు. murder జరిగిన తరువాత వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.

Rowdy sheeter killed with chicken knife in Jagittala Beat Bazaar
Author
Hyderabad, First Published Oct 16, 2021, 9:24 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని బీట్ బజార్ లో ఓ Rowdy sheeter హత్యకు గురయ్యాడు. పట్టణంలోని హనుమాన్ వాడ కు చెందిన రౌడీ షీటర్ తోట శేఖర్ ని ఓ దుండగుడు దారుణంగా హత్య చేశాడు. 

"

నిన్న రాత్రి బీట్ బజార్ లో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో చికెన్ కొట్టే కత్తితో శేఖర్ ను దుండగుడు stabbed to death. ఈ హత్యకు పాత కక్షలే కారణమని  స్థానికులు అంటున్నారు. murder జరిగిన తరువాత వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.

పండగ పూట జరిగిన ఈ ఘటనతో జగిత్యాల జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక బీట్ బజార్ లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో శుక్రవారం రాత్రి తోట శేఖర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సెంట్రింగ్ పని చేస్తూ జీవించే శేఖర్ ను గుర్తు తెలియని వ్యక్తులు  కత్తులతో దాడి చేసి హతమార్చారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన స్థలంలో  ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో విందు చేసుకున్నట్టు తెలిసింది. తగిన మైకంలో గొడవ ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులు అతని స్నేహితులే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. గతంలోనూ అతని మీద దాడులు జరిగాయని.. అప్పుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడని మృతుడు తల్లి చెబుతున్నారు. 

పోర్న్ సైట్లకు బానిసై మహిళలతో అసభ్య ప్రవర్తన... హైదరబాదీ యువకుడిపై పిడి యాక్ట్

కాగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గోపన్ పల్లి ప్రాంతంలో  ఈ నెల 11వ తేదీన జరిగిన మేస్త్రీ శేఖర్ హత్యకేసును గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం ఛేదించారు. అక్రమ సంబంధమే ఈ హత్యకు దారి తీసినట్లు గుర్తించారు.

తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో భార్యనే మేస్త్రీ శంకర్ ను తన ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి భార్యను, ఆమె ప్రియుడిని గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. Gachibowli ఇన్ స్పెక్టర్ గోనె సురేష్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.   

తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ధర్మారం తండాకు చెందిన ముడావత్ శేఖర్ (30) అదే ప్రాంతానికి చెందిన ముడావత్ జ్యోతి (26)ని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. మూడేళ్ల క్రితం గచ్చిబౌలీ పోలీసు స్టేషన్ పరిధిలోని గోపన్ పల్లి తండాకు దంపతులు వలస వచ్చారు. శేఖర్ మేస్త్రీ పని చేస్తుండగా జ్యోతి కూలీపనులు చేస్తూ వచ్చేది. 

రామచంద్రాపురం ఉస్మాన్ నగర్ కు చెందిన దుడ్డెల మాణిక్యం (42) తెల్లాపూర్ కు చెందిన రాజీవ్ రెడ్డి వద్ద కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రాజీవ్ రెడ్డి తెల్లాపూర్ లో ఇటీవల రెండు విల్లాలు కొన్నాడు. పనికోసం శేఖర్ దంపతులు వాటిలోకి వెళ్లారు. ఆ క్రమంలో మాణిక్యంతో వారికి పరిచయం ఏర్పడింది. 

వారికి దగ్గరవుతూ వచ్చిన మాణిక్యం జ్యోతితో అక్రమ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అది పసిగట్టిన శేఖర్ ఆమెను తరుచూ కొడుతూ వచ్చాడు. దాంతో ప్రియుడు మాణిక్యంతో కలిసి జ్యోతి భర్తను చంపేందుకు పథకం వేసుకుతంది. 

తమ పథకంలో భాగంగా ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మాణిక్యం శేఖర్ కు ఫోన్ చేశాడు. మద్యం తాగేందుకు పిలించాడు. శేఖర్ కు పురుగుల మందు తాగిన మద్యం తాగించాడు. ఆ తర్వాత గొడ్డలితో నరికి మేస్త్రీ శేఖర్ ను చంపాడు. అక్కడి నుంచి పారిపోయాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios