హైద్రాబాద్ పట్టణంలోని రాజేంద్రనగర్ పరిధిలో సూట్ కేసులో మృతదేహాం కలకలం రేపుతోంది.
 రషీద్ అనే దొంగను హత్య చేసి సూట్ కేసులో మృతదేహాన్ని పెట్టినట్టుగా నిందితులు పోలీసులకు చెప్పారు.

హత్య కు గురైన రషీద్  చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందినవాడు.జేబుదొంగగా ఆయనపై గతంలో కొన్ని కేసులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. డబ్బు పంపకాలు, పాతకక్షలు హత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.