ఓ రౌడీ షీటర్ హైదరాబాద్ నగరంలో దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి అతనిపై దాడి చేసి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

యాకుత్‌పురా జవహర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్‌ మహ్మద్‌ పర్వేజ్‌ ఆలియాస్‌ ఫర్రు డాన్‌ (26)పై 20 చోరీ కేసులు ఉన్నాయి. మంగళవారం రాత్రి చోటాపూల్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కత్తులు, డాగర్‌లతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. 

సమాచారం అందుకున్న రెయిన్‌బజార్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించింది. దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.