నిజామాబాద్ లోని ఓ గ్రామీణ బ్యాంకులో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్ తో లాకర్ కోసి ఎనిమిది కిలోల బంగారం కొట్టేశారు. ఈ క్రమంలో లక్షల విలువైన డబ్బు కాలిపోయింది. 

నిజామాబాద్ : నిజామాబాదులో ఓ బ్యాంకులో దొంగలముఠా దోచేసింది. ఆ ముఠా బ్యాంకు లాకర్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసింది. మూడున్నర కోట్ల విలువైన బంగారాన్ని కొట్టేసింది. ఈ ప్రయత్నంలో లక్షల రూపాయల క్యాష్ కాలిపోయింది. వింటుంటే ఈగ సినిమాలోని సీన్ గుర్తుకు వస్తుంది కదా. అచ్చం అలాగే ఈ బ్యాంకులోనూ జరిగింది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ లో ఈ ఘటన జరిగింది. అక్కడి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దోపిడి జరిగింది. దొంగలు అర్ధరాత్రి బ్యాంకు షట్టర్ తాళాలు పగలగొట్టి.. బ్యాంకులోకి చొరబడ్డారు. ఆ తర్వాత ముందుగా సీసీటీవీ కెమెరాలు కట్ చేశారు. పోలీసులకు అలర్ట్ మెసేజ్లు పంపే డివైజ్ను కూడా బ్రేక్ చేశారు. ఆ తర్వాత లాకర్ ను గ్యాస్ కట్టర్ సహాయంతో కోసేశారు. ఆరితేరిన దొంగల ముఠా పక్కా ప్లాన్ తో స్కెచ్ వేసి ఈ దోపిడీకి దిగినట్టుగా పోలీసులు చెబుతున్నారు. 

లాకర్ లో ఉన్న 830 తులాల బంగారాన్ని దోచుకుపోయారు. దీని విలువ సుమారు మూడున్నర కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బంగారం ఖాతాదారులు రుణాల కోసం తాకట్టు పెట్టిందే అని తెలిపారు. దొంగలు లాకర్ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసేటప్పుడు.. ఆ మంటలు అంటుకుని లాకర్లో ఉన్న సుమారు ఏడు లక్షల 30 వేల నగదు, విలువైన డాక్యుమెంట్లు కాలిపోయాయి. ఈ దొంగతనం అంతర్రాష్ట్ర ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు.

మరో ఘటనలో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుక్కునూరు పల్లిలో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 85 వేల వరకు నగదు దోచుకెళ్లారు. అర్ధరాత్రి పూట కిటికీలను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి బ్యాంకులోకి చొరబడ్డారు. బ్యాంకులోని సీసీ కెమెరాలను బ్లాక్ కలర్ వేసి, లాకర్ తాళాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Siddipet Crime News: సిద్దిపేటలో సినిమా స్టైల్ లో దొంగ‌త‌నం.. నిమిషాల్లో ల‌క్ష‌లు మాయం.. వీడియో

ఇదిలా ఉండగా, సిద్దిపేట జిల్లా కేంద్రంలో షాకింగ్ దొంగతనం జరిగింది. సినీ పక్కీలో జరిగిన ఈ దొంగతనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్కూటీలో ఉన్న లక్షల రూపాలయ కోసం ఏకంగా స్కూటీనే కొట్టేశారు ముగ్గురు దుండగులు. ఈ ఘటన సిద్ధిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

సిద్దిపేటకు చెందిన పర్షరాములు అనే వ్యక్తి ఏపీజీవీబీ బ్యాంకు లో నుంచి శనివారం రూ.2 లక్షల 49వేలు విత్ డ్రా చేశాడు. ఆ మొత్త్నాని తన స్కూటీ ఢిక్కీలో పెట్టాడు. ఈ విషయాన్ని దొంగలు గమనించారు. పరశురాములును వెంబడించారు. అతను ఓ చోట షాపింగ్ కోసం బండి పార్క్ చేసి వెళ్లగానే.. వారు కాసేపు స్కూటీ చుట్టూ తమదే అన్నట్టుగా తిరిగి.. మెల్లిగా స్కూటీని దొంగతనం చేశారు.