Asianet News TeluguAsianet News Telugu

Siddipet Crime News: సిద్దిపేటలో  సినిమా స్టైల్ లో దొంగ‌త‌నం.. నిమిషాల్లో ల‌క్ష‌లు మాయం.. వీడియో  

Siddipet Crime News: సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారీ దోపిడి జ‌రిగింది. సూటీలో ఉన్న రూ. 2.40 ల‌క్ష‌లను  ముగ్గురు దుండగులు దొంగలించారు. ఈ ఘ‌ట‌న సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ‌నివారం జ‌ర‌గ‌గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Siddipet Crime News thieves stole two lakhs 49thousand in siddipet cctv footage out
Author
First Published Jul 5, 2022, 1:02 AM IST

Siddipet Crime News: సిద్దిపేట జిల్లా కేంద్రంలో సినీ ప‌క్కీ త‌ర‌హాలో భారీ దోపిడి జ‌రిగింది. సూటీలో ఉన్న ల‌క్ష‌ల రూపాయాల‌ను ముగ్గురు దుండగులు దొంగలించారు. ఈ ఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణానికి చెందిన కర్రోళ్ల పర్షరాములు ఏపీజీవీబీ బ్యాంక్‌లో బ్యాంక్ మిత్రగా ప‌నిచేస్తున్నారు. ఈ క్ర‌మంలో శనివారం అతడు త‌న తండ్రితో కలిసి   పట్టణంలోని ఏపీజీవీబీ బ్యాంక్ కు వెళ్లారు. ఈ త‌రుణంలో ప‌ర్ష‌రాములు రూ.2లక్షల 49వేలు విత్ డ్రా చేశారు. ఆ మొత్తాన్ని తన స్కూటీ ఢీక్కిలో పెట్టాడు. ఈ విష‌యాన్ని దొంగ‌లు ప‌సిగ‌ట్టారు. బ్యాంకు నుంచి బయలుదేరిన పరుశరాములును దొంగ‌లు  అనుస‌రించారు. ఈ క్ర‌మంలో అత‌డు గాంధీ చౌరస్తాలోని ఓ దుకాణం ముందు స్కూటీ పెట్టి.. పాషింగ్ చేయ‌డానికి లోనికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు..
స్కూటీని దొంగ‌త‌నం చేశారు. 

స్కూటీకి నెమ్మ‌దిగా నెట్టుకుంటూ వెళ్లి.. జ‌న సంచారం త‌క్కువ‌గా ఉన్న ప్రదేశంలో ఆ స్కూటీని ఆపి డిక్కీలో పెట్టిన డబ్బులను దొంగలించారు. షాపింగ్ చేసుకొని తిరిగి వచ్చే సరికి త‌న స్కూటీ కనబడక పోవడంతో ప‌ర్ష‌రాములు వన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు  సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వారి ద‌ర్యాప్తులో మగ్గురు వ్యక్తులు స్కూటీని దొంగలిచ్చినట్టుగా గుర్తించారు. వాహనాన్ని దొంగిలించిన దుండ‌గులు.. కొంత దూరం తరలించుకుంటూ వెళ్లి.. స్కూటీ డిక్కీలోని రూ. 2.49 ల‌క్ష‌ల నగ‌దును కాజేసినట్లు పోలీసులు వివరించారు. 

బ్యాంకుకి వెళ్లిన సమయంలో చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌నీ, నిర్లక్ష్యంగా వ్యవహరించినా..  కాస్త  ఏమరపాటుగా ఉన్నా..కొద్ది పాటి నిర్లక్ష్యానికి కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios