శామీర్ పేట్ దగ్గర ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మేడ్చల్ : తెలంగాణలోని మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ, టాటా ఏస్ వాహనం ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీనిమీద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
