శంషాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాదులోని అప్పా జంక్షన్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో భారీ కంటైనర్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కంటైనర్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. 

మంటల్లో సూరజ్ అనే డ్రైవర్ కాలిపోయాడు, మూర్తునుజన్ అనే క్లీనర్ కూడా మరణించినట్లు ప్రచారం సాగుతోంది. ఏసి కంటెనర్ లో ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ నుండి రోయ్యల లోడుతో వస్తున్న భారీ కంటైనర్ ఓ లారీని ఢీకొట్టింది. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని చెబుతున్నారు.

రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చెసే లోపే రెండు ప్రాంణాలతో పాటు కంటైనర్ అగ్నికి అహుతి అయింది.