వేగానికి, గోడకి మధ్య కుటుంబం బలి.. విషాదయాత్రగా మారిన విహారయాత్ర

First Published 29, Jul 2018, 2:38 PM IST
road accident in nalgonda
Highlights

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్-నాగార్జున సాగర్ రహదారిపై ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్-నాగార్జున సాగర్ రహదారిపై ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ టోలీచౌకికి చెందిన ఐదు కుటుంబాలు విహారయాత్ర నిమిత్తం మూడు వాహనాల్లో నాగార్జునసాగర్‌కు బయలుదేరారు. తెల్లవారుజామున నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద ఒక కుటుంబం ప్రయాణిస్తున్న టవేరా వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనున్న బస్టాండ్‌ గోడను ఢీకొట్టింది.

వెనుక కార్లలో వస్తున్న వారు ప్రమాదాన్ని చూసి కార్లలో ఉన్న వారిని బయటకు తీశారు. అయితే అప్పటికే నలుగురు మరణించారు. మిగిలిన వారిని హుటాహుటిన హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విహారయాత్ర కాస్తా విషాదయాత్రగా మారడంతో బంధుమిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

loader