మేడ్చెల్ లో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి.. ఓవర్ టేక్ చేయబోయి...
మేడ్చల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అతి వేగంతో వెడుతూ ముందున్న లారీని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.
మేడ్చెల్ : అతి వేగం ముగ్గురి ప్రాణాలు తీసింది. తెలంగాణలోని మేడ్చెల్ కు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరణించినవారిలో ఇద్దరు యువకులతో పాటు ఓ యువతి ఉన్నారు. ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో బైక్ లారీ కిందికి దూసుకుపోయింది. దీంతో ప్రమాదం సంభవించింది. అతి వేగంతో బైక్ లారీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేసింది.
అన్నాచెల్లెళ్లను ఒకేసారి కాటేసిన పాము.. ఆదిలాబాద్ లో విషాదం..
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 4న ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. రోడ్డు ప్రమాదాలు, పాటించాల్సిన జాగ్రత్తల మీద మరోసారి దృష్టి సారించేలా చేసింది. ఈయన మరణానికి కూడా అతివేగమే కారణంగా పోలీసులు తేల్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మిస్త్రీ ప్రయాణించిన మెర్సిడెస్ కారును ముంబైకి చెందిన అనహిత పండోలే (55) అనే ప్రముఖ గైనకాలజిస్ట్ నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. అహ్మదాబాద్ నుంచి బయలుదేరి ముంబైకి వెళుతుండగా అతి వేగంగా ప్రయాణిస్తున్న వీరి కారు మరో వాహనాన్ని రాంగ్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో మిస్త్రీతో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు గాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో మిస్త్రి ప్రయాణిస్తున్న వాహనం 120 కిలోమీటర్ల కన్నా అధిక వేగంతో వస్తోందని.. ఈ ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న అనహిత పండోలే (55), ఆమె భర్త డారియస్ పండోలే (60) గాయాలతో బయటపడ్డారు. వెనక సీట్లో కూర్చున్న టాటా స్సన్స్ మాజీ చైర్మన్ Cyrus mistry, డారియల్ సోదరుడు జహంగీర్ పండోలే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వివరించారు.
ఈ ప్రమాదం గురించి అక్కడే రోడ్డు పక్కన గ్యారేజ్ లో పనిచేస్తున్న ఓ ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. అతను ఓ మరాఠీ టీవీ ఛానల్ వాళ్ళతో మాట్లాడుతూ… ‘ఈ కారును ఓ మహిళ నడిపారు. మరో వాహనాన్ని (ఎడమవైపు నుంచి) ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించగా.. కంట్రోల్ పోయి పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టారు’ అని వివరించారు. అయితే, పది నిమిషాల్లోనే సహాయం అందడం వల్ల ఇద్దరిని కార్లోంచి బయటకి లాగి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు కానీ ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.. అన్నారు. పీటీఐ కథనం ప్రకారం.. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మెర్సిడెస్ కారులో అహ్మదాబాద్ నుండి ముంబయికి వెళుతుండగా మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.