Medak: కారును ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం వద్ద ట్రాక్టర్ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
Road Accident: కారును ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం వద్ద ట్రాక్టర్ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు వర్గాలు తెలిపాయి.
ఈ ప్రమాదం గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం వద్ద మంగళవారం తెల్లవారుజామున ట్రాక్టర్- కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు స్వరూప (36), ఆమె కుమార్తె శ్రీలేఖ (13)గా గుర్తించినట్టు కౌడిపల్లి పోలీసులు తెలిపారు. స్వరూప తన భర్త మల్లేశం, కుమార్తెలు లావణ్య, శ్రీలేఖతో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో మల్లేశంకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసుకున్నామనీ, దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల మరిన్ని కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు..
మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో వేగంగా వచ్చిన ట్రక్కు గేమ్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్ యూవీ)ను ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. రాష్ట్ర రాజధాని ముంబైకి 650 కిలోమీటర్ల దూరంలోని అమరావతిలోని దర్యాపూర్-అంజన్గావ్ రోడ్డులో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బాధితుల్లో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందిన వారే కావడం గమనార్హం. కుటుంబ కార్యక్రమంలో పాల్గొని తిరిగి దర్యాపూర్ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దర్యాపూర్ లోని ఆస్పత్రికి తరలించారు.
నాగ్ పూర్-పూణే హైవేపై ఈ ఉదయం బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు పుణె నుంచి బుల్ధానాలోని మెహెకర్ కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
