మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. నార్సింగి మండలం జప్తిశివనూర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది గాయాలవ్వగా... ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది.

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. నార్సింగి మండలం జప్తిశివనూర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది గాయాలవ్వగా... ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది.

రామాయంపేట ప్రభుత్వాసుపత్రిలో వీరందరికీ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం హైదరాబాద్‌కు తరలించారు. కామారెడ్డి జిల్లా భాగిర్తిపల్లి నుంచి తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌కు పెళ్లి విందు కోసం వీరంతా వెళ్తున్నారు. డీసీఎం డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.