ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి ట్రాపిక్ సిగ్నల్ దగ్గ వాహానాల మీదికి దూసుకురావడంతో.. ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రెజిమెంటల్ బజార్లో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పడంతో ఓ జంట ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పుట్టింటి నుంచి భార్యను తీసుకువస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఈ దారుణ ఘటన గోపాలపురం ఠాణా పరిధిలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. 

ఆదివారం రాత్రి 8:10 నిమిషాలకి.. వైఎంసి సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ పడింది. దీంతో ట్రాఫిక్ అంతా నిలిచిపోయింది. అదే సమయంలో శ్రీ సాయి ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సు శంషాబాద్ నుంచి మేడ్చల్ కు వెళుతోంది. ఆ బస్సును మేడ్చల్ తిమ్మాపురం నివాసి అయిన బి. మహేష్ నడుపుతున్నాడు. మితిమీరిన వేగంతో బస్సు నడుపుతూ సిగ్నల్ పడింది గమనించుకోకుండా ఆగి ఉన్నవాహనాలను.. ఢీ కొట్టుకుంటూ కొద్ది దూరం అలాగే వెళ్ళాడు. ఈ ఘటనలో తూముకుంట పురపాలక పరిధి సింగాయిపల్లికి చెందిన కొత్తపల్లి సందీప్ గౌడ్(35) కిందపడ్డాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

టూ వీలర్ల పై ఉన్న మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరినీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సూరారం కాలనీకి చెందిన మరో వ్యక్తి వినయ్ ను.. ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

నల్గొండ జిల్లాలో అనుమానస్పద స్థితిలో ప్రేమ జంట మృతి.. చెట్టుకు వేలాడుతూ కనిపించిన మృతదేహాలు..

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బస్సు డ్రైవర్ మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో బస్సు దూసుకెల్లడంతో మూడు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి కారణం మితిమీరిన వేగం కాదని.. బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని డ్రైవర్ మహేష్ చెబుతున్నాడు. 

మితిమీరిన వేగంతో వాహనాల మీదికి దూసుకు వచ్చిన బస్సు ఆగగానే.. స్థానికులు డ్రైవర్ను పట్టుకొని చితకబాదారు. ఈ ప్రమాదం ఓ పచ్చని సంసారాన్ని నిలువునా కూల్చేసింది. మృతి చెందిన సందీప్ గౌడ్ కు ఏడాది క్రితమే పెళ్లయింది. ఆదివారం సాయంత్రం దిల్ షుక్ నగర్ లోని పుట్టింట్లో ఉన్న భార్యను తీసుకొని ఇంటికి వెళుతున్నాడు. ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. బస్సు వీరి బైక్ ను ఢీకొట్టడంతో.. భార్యాభర్తలిద్దరూ చెరోవైపు పడిపోయారు. ఓవైపు పడిన సందీప్ పైనుంచి బస్సు వెళ్ళింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భార్య కళ్ళెదుటే భర్తప్రాణాలు కోల్పోవడంతో ఆమె ఆ విషాదాన్ని తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతోంది.