Road Accident: దుండిగల్ బౌరంపేటలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు చనిపోగా.. ఒకరి పరిస్థితి విషయంగా ఉంది. మద్యంమత్తులో కారును అతివేగంతో నడిపినట్టు, ఇదే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు.
Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బౌరంపేట కోకాకోలా కంపెనీ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడిక్కకడే దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
మద్యం మత్తులో ఉన్న యువకులు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో కారును అతి వేగంగా నడుపుతూ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించారు.
మృతులను ఏలూరు, విజయవాడ వాసులుగా గుర్తించారు. మృతుల్లో చరణ్‌ది విజయవాడ కాగా.. సంజూ, గణేశ్‌లది ఏలూరు అని తెలిపారు. గాయపడిన అశోక్ అనే యువకుడిని సూరారంలోని ఓ ఆసుపత్రిలో తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో చరణ్ కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కారులోని వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగం కోసం వచ్చిన వీరు మద్యం సేవించి కారు నడిపి ప్రమాదానికి గురైనట్లు వివరించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు .. ఏపీలో కారు బీభత్సం సృష్టించింది. విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో ఓ మ౦దుబాబు వాకర్స్, వాహనాలపైకి కారుతో దూసుకుపోయాడు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. బీచ్ రోడ్డులో ఉదయం పూట వాహనాలకు నో ఎ౦ట్రీ ఉన్నా.. మద్యం మత్తులో కారుతో వచ్చి బీభత్స౦ సృష్టించాడు. రా౦గ్ రూట్ లో వెళ్లి.. వాకర్స్‌కు భయబ్రా౦తులకు గురిచేసాడు. అడ్డుకోబోయిన పోలీసులపై కూడా కారుతో దూసుకెళ్లాడు. చివరకు బారికేడ్లను అడ్డుపెట్టి ఆ వాహనాన్ని నిలిపిచేశారు.
