జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటో ను ఓ కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రమాద స్థలంలోనే మృతిచెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని ఉండవల్లి మండలం ఆలంపూర్ లో కూడలి వద్ద ఓ షేరింగ్ ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బోల్తాపడింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని క్షతగాత్రులను కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

ఈ ప్రమాదంపై కేసు నమోదు చయేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.