రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది దుర్మరణం

First Published 26, May 2018, 6:21 PM IST
Road accaident Rajiv Rahadari: 8 dead
Highlights

తెలంగాణలోని రాజీవ్ రహదారిపై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

సిద్దిపేట: తెలంగాణలోని రాజీవ్ రహదారిపై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాలుగు వాహనాలు ఒక్కదాన్నొక్కటి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా, 20 మంది దాకా గాయపడినట్లు సమాచారం. 

మృతుల్లో నలుగురు మహిళలు , ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్వాలీస్‌లోని ప్రయాణికుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, బస్సు బోల్తాపడి మిగతా నలుగురు మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సిద్ధిపేట జిల్లా గజ్వెల్ సమీపంలోని రిమ్మనగూడెం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. వాహనాలు అతి వేగంగా దూసుకుపోతూ ఒకదాన్నొక్కటి దాటేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు బోల్తా కొట్టింది. బస్సు ప్రయాణికుల్లో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. కాగా, ఓ లారీనీ టాటా సుమో, మరో వాహనం ఢీకొట్టింది. 

loader