రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితి మారింది. కేసీఆర్, కోదండరాం దారులు వేరయ్యాయి.

ఇద్దరి పోరాటం ఒక్కటే.. ఇద్దరి లక్ష్యం ఒక్కటే... అందరిని కలుపుకపోయి అనుకున్నది సాధించారు... అటు తర్వాత ఒకరేమో పీఠమెక్కి ప్రజల పన్నులతో రాజభోగాలు అనుభవిస్తుంటే.. మరొకరు అదే ప్రజల కోసం మళ్లీ ఉద్యమిస్తున్నారు.

ఒకరు శ్రీవారి సేవలో తరిస్తుంటే.. మరికొకరు శ్రీకృష్ణ జన్మస్థలంలో విశ్రమిస్తున్నారు.

బహుశా... విధి వైచిత్రి అంటే ఇదేనేమో...

ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో తెలంగాణ ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా..

ఒకరు సీఎం కేసీఆర్ అయితే మరొకరు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏకైక ఏజెండగా పార్టీ పెట్టి 12 ఏళ్ల పోరాటం తర్వాత అధికారంలోకి వచ్చారు కేసీఆర్. తన ఉద్యమ ప్రస్థానంలో ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. చివరకు అందరిని ఏకం చేసి రాష్ట్ర ఏర్పాటు అనే సుదీర్ఘ స్వప్నాన్ని నిజం చేశారు. ఎన్నికల వేళ గెలిచి తెలంగాణ తొలి సీఎం అయ్యారు.

ప్రొఫెసర్ గా ప్రజాసమస్యలపై ఉద్యమించి కేసీఆర్ కంటే ముందే తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్న వ్యక్తి కోదండరాం. ప్రొఫెసర్ జయశంకర్ నుంచి తెలంగాణ భావజాలాన్ని అందిపుచ్చుకొని ఉద్యమం సమయంలో కేసీఆర్ తో కలిసిపోరాడారు.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితి మారింది. కేసీఆర్, కోదండరాం దారులు వేరయ్యాయి.

ఒకరు పరిపాలనలో మునిగిపోతే మరొకరు ఇంకా ప్రజా సమస్యలపై గొంతెత్తుతూనే ఉన్నారు.

ఒకరేమో పీఠమెక్కి ప్రజల పన్నులతో రాజభోగాలు అనుభవిస్తుంటే.. మరొకరు అదే ప్రజల కోసం మళ్లీ ఉద్యమిస్తున్నారు. ఒకరు శ్రీవారి సేవలో తరిస్తుంటే.. మరికొకరు శ్రీకృష్ణ జన్మస్థలంలో విశ్రమిస్తున్నారు.